మహిళకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి.. సాయం పేరుతో మొత్తం దోచుకుని.. ఆపై పరారీ

Wait 5 sec.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్ అడిగిన పాపానికి.. ఓ మహిళను ఒక వ్యక్తి మొత్తం దొంగిలించేశాడు. ఆ తర్వాత ఆమెను తోసేయడంతో గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను గుర్తించిన స్థానికులు.. ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఆ దొంగ పరారీలో ఉండటంతో.. అతడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆవునూరు గ్రామంలోని ఓ మహిళ ముస్తాబాద్ మండల కేంద్రానికి వెళ్లేందుకు వేచి ఉంది. అదే సమయంలో ఓ వ్యక్తి బైక్‌ మీద అటు వైపు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడిని లిఫ్ట్ అడిగింది. ఈ క్రమంలోనే ఆ మహిళను బైక్‌పై ఎక్కించుకున్న ఆ వ్యక్తి.. ముస్తాబాద్ వెళ్లే దారిలో వెంకయ్యకుంట గ్రామ శివారులో రోడ్డు నుంచి కొంచెం దూరంలో ఉన్న కోళ్ల ఫామ్ వద్ద ఆపాడు. ఆ తర్వాత ఆ మహిళను తీవ్రంగా బెదిరించాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలను ఇవ్వాలని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ వేసుకున్న రెండున్నర తులాల పుస్తెలతాడు.. మట్టెలు, చెవిపోగులు, ముక్కు పోగులు వంటి బంగారు, వెండి ఆభరణాలను లాక్కున్నారు. వద్దని ఎంత వేడుకున్నా వినకుండా ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళను అక్కడే తోసేసి పారిపోయాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. ఎలాగోలా రోడ్డు వరకు వచ్చి పడిపోయింది. ఈ క్రమంలోనే గాయాలతో రోడ్డుపై పడిపోయిన మహిళను గుర్తించిన స్థానికులు.. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంతేకాకుండా ఆ మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ మహిళను చికిత్స కోసం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మహిళ నుంచి ఆభరణాలు దోచుకుని పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభిచారు. ఇక ఆ నిందితుడిని పట్టుకుని.. తమకు న్యాయం చేయాలని బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు స్థానికులు కీలక సూచనలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్ట్‌ ఇస్తే.. వారిని నమ్మి వారి వాహనాల్లో ప్రయాణించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఒకవేళ అలా వెళ్లాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఏదైనా అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.