నిన్నటి వరకూ విజయ.. ఇప్పుడేమో విజయమ్మ గారూ.. ఎందుకంతలా ఒలకబోస్తున్నావ్ లోకేష్: రాచమల్లు

Wait 5 sec.

రాజకీయాల్లో ఎప్పుడు, ఏం జరుగుతుందనేదీ ఎవరూ ఊహించలేని విషయం. రాజకీయ రంగంలో చేయి కదిపినా దానికో కారణం ఉంటుందంటారు విశ్లేషకులు. రాజకీయ నేతలు మాట్లాడే మాటలు, చేసే చేతల వెనుక అంతర్లీనంగా అనేక ఉద్దేశాలు ఉంటాయని చెప్తుంటారు. అయితే అన్నిసార్లూ ఇదే కారణమై ఉండకపోవచ్చు కూడా.. కానీ, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మాత్రం దీనితో విభేదిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మకు మంత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటంపై రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 19వ తేదీ పుట్టినరోజు జరుపుకున్నారు.విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పలవురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే చెప్తూ ట్వీట్ చేశారు. వైఎస్ విజయమ్మ గారు ఆరోగ్యం, సంతోషంతో కలకలం ఉండాలని కోరుకుంటున్నట్లు నారా లోకేష్ ట్వీట్ చేశారు. అయితే విజయమ్మకు నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటం వైసీపీ వర్గాలను కూడా కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే విషయంపై కొంతమంది సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. "వైఎస్ విజయమ్మ గారి పట్ల మునుపెన్నడూ లేని విధంగా నారా లోకేష్ ప్రేమను ఒలకబోస్తున్నాడు. విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ ట్వీట్ చేశారు. మీరు మరింత ఆరోగ్యం, ఆయుష్షు, మానసిక శాంతిని కలిగి సంతోషంగా జీవించాలంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఉన్నట్లుండి ఇంత ప్రేమ ఎందుకు లోకేష్? ఎప్పుడూ ఇలా లేదే.. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి , 2014 నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడూ కూడా విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే.. ఇంతవరకూ ఎప్పుడూ కూడా లోకేష్ విజయమ్మ గారిని.. వైఎస్ విజయమ్మ అని ఎప్పుడూ అనలేదు. వైఎస్ విజయ అని సంభోధించేవాడు.""అమ్మను, పెద్దావిడను పిలిచినట్లు పిలవలేదు. ఫ్రెండును మాట్లాడినట్లు, సాధారణ స్త్రీని మాట్లాడినట్లు మాట్లాడాడు. నీ వయసెంత, ఆమె వయసు ఎంత లోకేష్.. గతంలో వైఎస్ విజయ అని సంభోధించిన నువ్వు.. ఈరోజు విజయమ్మ అని పిలుస్తున్నావ్. జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారని.. ఆ కుటుంబంలో ఉన్న కలహాలను రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నావ్" అంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు.