సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..

Wait 5 sec.

AP Government Dismiss kakarla venkatrami Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ సచివాలయని విధుల నుంచి డిస్మి్స్ చేసింది. ప్రభుత్వం ఉద్యోగం నుంచి కె. వెంకట్రామిరెడ్డిని శాశ్వతంగా తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వెంకట్రామిరెడ్డి పదవీ విరమణ ప్రయోజనాలను కూడా నిలిపివేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి జీవో విడుదల చేశారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ప్రచారం . ప్రభుత్వ ఉద్యోగి అయిన కె. వెంకట్రామిరెడ్డి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం 2024లో వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది. రెండేళ్లుగా ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. అలాగే ఆరోపణలపై విచారణ కొనసాగింది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనటాన్ని తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తూ కె. వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపరంగా ముందుకు వెళ్తానని వెంకట్రామిరెడ్డి తెలిపారు. చట్టపరంగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మరోవైపు వెంకట్రామిరెడ్డిపై గతంలో టీడీపీ నేతలు అనేకసార్లు ఆరోపణలు చేశారు. అధికార పరిధిని అతిక్రమించి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో కె. వెంకట్రామిరెడ్డి అసిస్టెంట్‌ సెక్రెటరీగా పనిచేస్తున్నారు . అయితే 2024 ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ వైసీపీ తరఫున వెంకట్రామిరెడ్డి ప్రచారం చేసినట్లు విచారణలో రుజువైంది. దీంతో ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోల్పోవటమే కాకుండా.. పదవీ విరమణ ప్రయోజనాలను కూడా కోల్పోవాల్సి వస్తోంది. అయితే దీనిపై న్యాయపోరాటం చేస్తానని వెంకట్రామిరెడ్డి చెప్తున్నారు. అటు ఉద్యోగుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే సర్కారు ఇలాంటి చర్యలు తీసుకుంటోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.