'తిరుమల శ్రీవారి భక్తులు జాగ్రత్తగా ఉండాలి.. వాళ్లను అస్సలు నమ్మొద్దు': టీటీడీ

Wait 5 sec.

తిరుమ‌ల‌లో ద‌ర్శనాలు, గ‌దులు ఇప్పిస్తామంటూ ఇటీవల కాలంలో కొంద‌రు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా భ‌క్తుల‌కు మాయ మాటలు చెప్పి మోస‌గించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. ఈ మేరకు టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో, పోలీసుల స‌మ‌న్వయంతో సోషియ‌ల్ మీడియాలో “శ్రావ‌ణ్ క‌ళ తిరుమ‌ల‌, తిరుప‌తి వెంకటేశ్వర స్వామి దేవ‌స్థానం” ఐడీతో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన కామ‌సాని ప‌వ‌న్ కుమార్ అలియాస్ నాగ‌రాజు, బోడిరెడ్డి చెన్నకేశ‌వులు అనే వ్యక్తుల‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారని పేర్కొన్నారు.ఇటీవ‌ల సోషల్ మీడియాలో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న ఉందంతాల దృష్ట్యా భ‌క్తులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారానే దర్శనాలు, గదులు బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు. ఎవ‌రైనా తిరుమ‌ల‌లో ద‌ర్శనాలు, గ‌దులు తీసి ఇస్తామ‌ని చెబితే నమ్మొద్దన్నారు. అలాంటి వ్యక్తుల స‌మాచారం తెలిస్తే టీటీడీ విజిలెన్స్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నంబర్ 9866898630కు ఫిర్యాదు చేయాలని సూచించారు.తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఢిల్లీ సీఎంఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆమెకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును వివరించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్న ప్రెడిక్టివ్ అనలిటిక్స్ విధానాన్ని వివరించారు. అలాగే లడ్డూ ప్రసాదం తయారీ, ట్రాఫిక్ నిర్వహణ, వసతి సదుపాయాల సమన్వయం వంటి అంశాల్లో ఈ సెంటర్ పనితీరును కూడా వివరించారు. భక్తుల భద్రతకు టీటీడీ చేస్తున్న కృషిని ఢిల్లీ ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రం కోలార్‌కు చెందిన హైడ్రోకార్ట్ టెక్నో సొల్యూషన్స్ సంస్థ ఎండీ గణేష్ జయవేల్ రూ.10 లక్షలు విలువైన బ్యాటరీ బగ్గీ వాహనాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను పేష్కార్ రామకృష్ణకు అందజేశారు.తిరుపతి సప్తగిరుల్లో వెలసిన పవిత్ర క్షేత్రమైన శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వరస్వామి దేవాలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సప్తగిరులలో అత్యంత పుణ్యప్రదమైన కపిలతీర్థంలో స్నానం చేయడం వల్ల దేవతలతో పాటు పితృదేవతలు సంతోషిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నారు చాగంటి. భక్తులు ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకుని, అనంతరం కామాక్షి సమేత కపిలేశ్వరస్వామిని దర్శించుకోవడం ద్వారా సంతానం, శ్రేయస్సు, కుటుంబ సుఖసంతోషాలు కలుగుతాయని వివరించారు. అలాగే కాలభైరవ స్వామి, కోటిలింగాలు, బిల్వ వృక్షం దర్శనం చేసి బయలుదేరితే మరింత శుభఫలితాలు లభిస్తాయని తెలిపారు.