రూ.40,000 కోట్ల Jio ఐపీఓపై బిగ్ అప్డేట్.. మే నెలలో సెబీకి ముసాయిదా పత్రాలు!

Wait 5 sec.

: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సర్వీసెస్ కంపెనీ జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ (Jio Platforms Ltd) పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. తాజాగా బిగ్ అప్డేట్ లభించింది. ఈ జియో ఐపీఓ (Jio IPO)కు సంబంధించిన ముసాయిదా పత్రాలను మే నెలలో మార్కెట్ రెగ్యులేటరీ సెబీకి సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత మార్చి నెలతో ముగిసిన చివరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలతో ఈ డ్రాఫ్ట్ పత్రాలను సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి, జియో ఐపీఓకు సంబంధించిన పత్రాలను మార్చి నెల ముగిసే నాటికే సమర్పించాలని కంపెనీ తొలుత భావించినట్లు వార్తలు వచ్చాయి. డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలతో ఐపీఓ పత్రాలను దాఖలు చేయనున్నట్లు అప్పుడు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇరాన్- అమెరికా యుద్ధం రూపంలో ఐపీఓ సన్నాహాలకు బ్రేక్ పడింది. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ ఐపీఓకు ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది. రూ.40 వేల కోట్లు!పంలో తొలిసారి ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఇది దేశంలోని మెగా పబ్లిక్ ఇష్యూల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. జియో ప్లాట్ ఫామ్స్ కంపెనీ విలువను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు 170 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.15.78 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఐపీఓ ద్వారా ఇందులో 2.5 శాతం వాటాను జియో విక్రయించినా దాదాపు రూ.40 వేల కోట్లు సమీకరించవచ్చని అంచనా వేస్తున్నారు. ఐపీఓను నిర్వహించేందుకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ, జేఎం ఫైనాన్షియల్ వంటి 19 బ్యాంకులను ఇప్పటికే రిలయన్స్ నియమించుకుంది. రిలయన్స్ జియో ప్లాట్ ఫామస్ ఐపీఓ 2026 తొలి అర్ధభాగంలోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. మే, 2026లో డీఆర్‌హెచ్‌పీ సమర్పించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. రూ.40 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా దేశంలోని అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ఆకాశ్ అంబానీ నాయకత్వంలో ఈ ప్రక్రియ జరగనుంది. సెబీ నిబంధనల ప్రకారం 2.5 శాతం నుంచి 5 శాతం వరకు వాటాను విక్రయించే అవకాశం ఉంది. ఈ లెక్కన 5 శాతం వాటా విక్రయించినట్లయితే రూ.80 వేల కోట్లతో అతిపెద్ద ఐపీఓగా అవతరించనుంది.