Gold Imports: దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం 2025- 26లో బంగారం దిగుమతులు 24 శాతం పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. దేశంలోకి దిగుమతి అయిన మొత్తం పసిడి విలవ 71.98 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతకు ముందు 2 ఇక అంతకు ముందు ఏడాది 2023- 24 ఆర్థిక ఏడాదిలో 45.54 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. 2022- 23 సంవత్సరంలో కేవలం 35 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి కావడం గమనార్హం. గత ఏడాది నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరుకున్నాయి. బంగారం ధరలు భారీగా పెరగడంతో పసిడి దిగుమతుల బిల్లు సైతం ఆ స్థాయిలోనే పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పరిమాణం పరంగా మాత్రం తేడాలు ఉంటాయి. ఆర్థిక ఏడాది 2024- 25 సంవత్సరంలో దేశంలో 757.09 టన్నుల బంగారం ఉండగా అది 4.76 శాతం మేర క్షీణించింది. దీంతో ప్రస్తుతం 721.03 టన్నులకు బంగారం తగ్గడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతూలు 150 శాతం మేర పెరిగాయి. మొత్తం 12 బిలియన్ డాలర్లకు సమానమైన వెండి దేశంలోకి దిగుమతైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిమాణం పరంగానూ వెండి దిగుమతుల్లో భారీ వృద్ధి కనబడింది. వెండి ఇంపోర్ట్స్ ఏకంగా 42 శాతం మేర పెరిగాయి. మొత్తంగా 7334.96 టన్నుల వెండి దిగుమతి అయింది. బంగారం, వెండి దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు 333.2 బిలియన్ డాలర్లకు చేరిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5 శాతం ఉంటోంది. ప్రస్తుతం బంగారం 10 గ్రాముల ధర రూ. 1.56 లక్షలుగా ఉంది. వెండి కిలో ప్రస్తుతం రూ. 2.53 లక్షలుగా ఉంది. దేశంలోకి వస్తున్న మొత్తం దిగుమతుల్లో ఆ దేశం నుంచి 40 శాతంగా ఉంది. ఆ తర్వాత యూఏఈ నుంచి 16 శాతం బంగారం వస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం మేర బంగారం దేశంలోకి వస్తోంది. చైనా తర్వాత అత్యధికంగా బంగారం దిగుమతులు చేసుకుంటున్న దేశంగా భారత్ నిలుస్తోంది.