Alert: ప్రస్తుతం ప్రపంచం అమెరికా ఆధిపత్యం నుంచి మల్టీపోలార్ ప్రపంచ వ్యవస్థ వైపు పరివర్తన చెందుతోంది. ఇందులో భారతా, చైనా, బ్రెజిల్, రష్యా వంటి దేశాలు తమ ప్రభావాన్ని పెంచుకుంటున్నాయి. ఈ మార్పు అనేది ప్రధానంగా పెరుగుతున్న సరఫరా అంతరాయాలు, వాణిజ్య యుద్ధాలు, ప్రాంతీయ ఉద్రిక్తతల వంటి వాటితో కలుగుతోంది. దేశాలు తమ రక్షణ పెట్టుబడులను పెంచేలా చేస్తోంది. బహుదిశల నుంచి వస్తోన్న భద్రతా సవాళ్లను అధిగమించేందుకు తమ ఆయుధాలను ఆధునికీకరిస్తున్నాయి. భారత్ సైతం తమ రక్షణ బడ్జెట్ పెంచుతోంది. ఒకప్పుడు అతిపెద్ద ఆయుధ దిగుమతి దారుగా ఉన్న భారత్ ఇప్పుడు ఎగుమతి దారుగా ఎదిగింది. 85 దేశాలకు ఆయుధాలను అందిస్తోంది. ఇందులో అమెరికా, ఫ్రాన్స్ దేశాలు సైతం ఉండడం గమనార్హం. ఈ క్రమంలో డిఫెన్స్ కంపెనీల స్టాక్స్ రాణిస్తుంటాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు సైతం డిఫెన్స్ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. () సరికొత్త డిఫెన్స్ ఫండ్ తీసుకొచ్చింది. యాక్సిస్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ () పేరుతో లాంచ్ చేసింది. చాలా తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి డిఫెన్స్ రంగంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఈ స్కీమ్ బెంచ్ మార్క్ గా ఉంటుంది. యాక్సిస్ ఎంఎఫ్ తెచ్చిన ఈ డిఫెన్స్ ‌ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల్ 10వ తేదీనే మొదలైంది. ఏప్రిల్ 24, 2026 వరకే అందుబాటులో ఉంటుంది. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ టీఆర్ఐని అనుసరిస్తూ దీర్ఘకాలంలో మూలధన లాభాలు అందించే లక్ష్యంతో ఈ కొత్త ఫండ్ తీసుకొచ్చినట్లు యాక్సిస్ ఏఎంసీ తెలిపింది. ఇందులో కనీస పెట్టుబడి రూ.100గా నిర్ణయించారు. ఆ తర్వాత రూ.100 చొప్పున ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ న్యూ ఫండ్ ఆఫర్ లో పాల్గొని యూనిట్లు కేటాయించిన 15 రోజుల్లోనే వెనక్కి తీసుకుంటే 0.25 శాతం ఎగ్జిట్ లోడ్ పడుతుంది. ఆ తర్వాత అయితే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. అయితే, అందుకే సరైన అవగాహన లేకుండా పెట్టుబడి పెడితే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే వారు ఈ న్యూ ఫండ్ ఆఫర్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అలాగే తమ పెట్టుబడి లక్ష్యం, ఆర్థిక అవసరాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.