సార్.. దయచేసి వాళ్లను ఇక సహించొద్దు.. చంద్రబాబు పుట్టినరోజున బండ్ల గణేష్ ఎమోషనల్

Wait 5 sec.

ఏపీ ముఖ్యమంత్రి నారా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ క్రమంలోనే సినీ నిర్మాత .. పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. ఇదే క్రమంలో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన సందర్భాన్ని, సింగపూర్ పర్యటన విషయాలను బండ్ల గణేష్ పంచుకున్నారు. " చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు సింగపూర్ మొత్తం తిరిగారు. మీటింగ్‌లన్నీ పూర్తి చేసుకుని.. హోటల్ వద్దకు చేరుకున్నారు. రాత్రి పది గంటలైంది. రేపు ఉదయం ఆరు గంటలకల్లా రెడీగా ఉండమని చెప్పి సిబ్బంది అందరినీ ఆదేశించి పంపించేశారు. పక్కనున్న మిత్రుడితో "నేను స్నానం చేసి వస్తా, రెడీగా ఉండు బయటకు వెళ్దాం.. ఎవరితోనూ చెప్పొ్ద్ద"ని చెప్పారు. పైన ఉన్న గదిలోకి స్నానం చేయడానికి వెళ్లారు. ఈలోపు పక్కనున్న మిత్రుడు ఎక్కడికి వెళ్దామంటారో, ఏమోనంటూ ఆలోచనలో పడ్డారు. ఏ సినిమాకు తీసుకెళ్లమంటారో, ఏ కార్యక్రమానికి తీసుకెళ్లమంటారోనని ఆలోచిస్తున్నారు. ఈలోపు సార్ రెడీ అయ్యి వచ్చారు. కిందకు వచ్చాక కారులో కూర్చుని.. సింగపూర్‌లో డంపింగ్ యార్డ్ ఎలా ఉంటుందో, సింగపూర్‌లో చెత్త సేకరించే విధానం చూపించంటూ తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ తిరిగారు. ఈ రకంగా హైదరాబాద్‌ను తయారుచేస్తానయ్యానని అన్నారు""ఆ రోజే భవిష్యత్ గురించి ఆలోచించిన నాయకుడు ఆయన. తన కుటుంబం గురించి, తన బావాబామ్మర్దుల గురించి, తన స్వార్థం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. తెలుగువాడి కోసమే ఆలోచించారు. తెలుగువాడు ఎవరిపై ఆధారపడకూడదు. తెలుగు యువత ప్రపంచాన్ని శాసించాలని ఆలోచించారు. దివిసీమ తుపాను వచ్చినప్పుడు తమ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోనని వ్యవసాయం చేసుకునే కుటుంబాలు భయపడ్డాయి. వారందరికీ దేవుడి రూపంలో సాయంగా నిలిచారు. చంద్రబాబు ఐటీ రంగాన్ని పరిచయం చేయటం ద్వారా వారి పిల్లలు చదువుకుని ఈ రోజు లక్షలు, కోట్లు సంపాదిస్తూ బ్రహ్మాండంగా బతుకుతున్నారంటే అది చంద్రబాబు దయ.." అని బండ్ల గణేష్ అన్నారు "మంచి వ్యక్తిని, పోనీలే అని వదిలేసే వ్యక్తిని విమర్శించటం ఈ మధ్య సులభంగా మారిపోయింది. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనను కోరుతున్నా. సార్.. మీ బర్త్‌డే రోజు అడుగుతున్నా. అన్యాయంగా మిమ్మల్ని విమర్శించేవారిని ఊరుకోవద్దు. మిమ్మల్ని విమర్శిస్తే తట్టుకోలేకున్నాం. ట్విట్టర్ ఉంది కదా అని ఇష్టానుసారం ట్వీట్లు చేస్తున్నారు. చంద్రబాబును ఏం చేస్తున్నారని విమర్శించేవారిని ఒకటే అడుగుతున్నా. నువ్వొచ్చి చెయ్. పదిమందికి సాయం చెయ్.. భవిష్యత్తు అందించు. పది కంపెనీలు తీసుకురా. ఎన్నోన్నో కంపెనీలు తెచ్చి. ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చి. చలిలో కూడా షర్టుతో కుర్రాడిలో తిరుగుతున్న చంద్రబాబును విమర్శించేందుకు మీది నోరా.. కడుపా?" పనిచేసేవాడిని ప్రోత్సహించండి. చంద్రబాబు వందో పుట్టినరోజును ఘనంగా నిర్వహించే రోజు వస్తుంది. 25 ఏళ్లలో అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేసి.. మేము తెలుగు ప్రజలం అని గర్వంగా చెప్పుకునేలా చేసే నాయకుడు చంద్రబాబు "అంటూ బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు.