కస్టమర్లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్.. పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ధర పెంపు.. కొత్త టారిఫ్స్ ఇవే

Wait 5 sec.

: కొంత కాలంగా మొబైల్ రీఛార్జ్ మరింత భారంగా మారిందని చెప్పొచ్చు. ఒకప్పుడు రూ. 10, రూ. 20, రూ. 50 లతో రీఛార్జ్ చేసుకునేవాళ్లం. క్రమక్రమంగా ఇది పెరుగుతూ వచ్చింది. అప్పట్లో మనం వాడుకున్నదానికి మాత్రమే ధర చెల్లించాల్సి వచ్చేది. తర్వాత్తర్వాత డేటా కారణంతో టారిఫ్స్ పెంచేస్తూ వెళ్లాయి టెలికాం సంస్థలు. ముఖ్యంగా దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన.. రిలయన్స్ జియో రాకతో అంతా మారిపోయింది. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా అంటూ ప్లాన్స్ తీసుకురాగా.. మిగతా కంపెనీలు కూడా ఇదే అనుసరించాల్సి వచ్చింది. ఇక్కడ కూడా . ఇక ఇప్పుడు నెల రీఛార్జ్ కోసం కనీసం రూ. 300 వరకు చెల్లించాల్సి వస్తోంది. మొదట్లో 1GB/Day ప్లాన్స్ తీసుకురాగా.. వీటిని క్రమంగా ఎత్తేసి.. ట్రూ అన్‌లిమిటెడ్ 5G కోసం మినిమం 2GB/Day రీఛార్జ్ ప్లాన్స్ చేసుకోవాలని షరతులు విధిస్తున్నాయి. 1.5 GB/Day ప్లాన్స్ కూడా చాలా అరుదుగా ఉన్నాయి. ఇటీవల క్రమంగా ఇతర ప్లాన్ల ధరల్ని సవరిస్తున్నాయి. ఎయిర్‌టెల్ ఇటీవలే చాలా వరకు ప్లాన్ ధరల్ని సవరించగా.. ఇప్పుడు మరో షాకింగ్ ప్రకటన చేసింది. ఎయిర్‌టెల్‌లో అత్యంత ఆదరణ ఉన్న రూ. 859 రీఛార్జ్ ప్లాన్‌ ధరల్ని సవరించింది. బెనిఫిట్స్ మాత్రం మార్చలేదు. రూ. 40 పెంచి ఇప్పుడు దీనిని రూ. 899 కి చేర్చింది. ఇక్కడ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ధరల్ని మార్చేసింది. కస్టమర్లు ఆ ప్లాన్ కోసం చూస్తుంటే.. రూ. 899 తో రీఛార్జ్ చేసుకోవాలని కనిపిస్తోంది. 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ కింద డైలీ 1.5 GB డేటా సహా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS లు, ఎయిర్‌టెల్ ఫ్రీ హలోట్యూన్ బెనిఫిట్స్ అందిస్తోంది. అయితే ఇక్కడ రిలయన్స్ జియోలో.. ఇదే రూ. 899 ధరకు డైలీ 2GB డేటాతో 84 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ అందుబాటులో ఉంది. ఇంకా డైలీ 1.5 GB డేటా 77 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రూ. 799 ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ తొలగించింది. టెలికాం కంపెనీలు.. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) పెంచుకునేందుకు ఇలా ఎప్పటికప్పుడు ధరల్ని సవరిస్తున్నాయి. ఇదే బాటలో రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కూడా ధరల్ని సవరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.