మళ్లీ తగ్గిన బంగారం ధర.. వరుసగా 2 రోజూ ఇలా.. ఇవాళ హైదరాబాద్‌లో గోల్డ్ రేటు ఎంతకు దిగొచ్చిందంటే?

Wait 5 sec.

Gold Price Fall: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు ఎప్పుడు పడుతుందోనని భారత్ వంటి చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయి. చమురు, గ్యాస్ సహా పలు వస్తువుల దిగుమతుల్లో అంతరాయాలు ఏర్పడి ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం కాస్త ఉపశమనం లభించినట్లయింది. అయితే, ఆ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు బులియన్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. సాధారణంగా ఉద్రిక్తతలు ఉంటే ధరలు పెరుగుతాయి. కానీ, ఇరాన్ యుద్ధం సమయంలో ఊహించని విధంగా బంగారం ధరలు మారుతుండడం గమనార్హం. ప్రధానంగా ట్రంప్ చేసే ప్రకటనలు బంగారం ధరలను నడిపిస్తున్నాయని చెప్పవచ్చు. అదే కొనసాగిస్తూ ఈరోజు సెషన్‌లోనూ పసిడి రేట్లు పడిపోయాయి. దీంతో కొనుగోలుదారులకు ఊరట లభించినట్లయింది. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం రేట్లు ఏప్రిల్ 22వ తేదీన ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలపై డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. క్రితం సెషన్‌లో దిగివచ్చిన పసిడి రేట్లు ఈరోజు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 55 డాలర్లు పెరిగి 4755 డాలర్లపైన ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.10 శాతం మేర పెరిగి 77.98 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో సెషన్‌లో దిగివచ్చాయి. 24 క్యారెట్ల పసిడి ధర క్రితం సెషన్‌లో 10 గ్రాములకు రూ. 490 మేర తగ్గగా ఈరోజు మరో రూ.540 మేర పడిపోయింది. దీంతో ఇవాళ తులం బంగారం రేటు రూ.1,54,750 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు నిన్నటి రోజున తులంపై రూ.450 తగ్గగా ఈరోజు మరో రూ.500 మేర తగ్గింది. దీంతో 10గ్రాముల బంగారం రేటు రూ.1,41,850 వద్దకు తగ్గింది. స్థిరంగా వెండి రేటు నిన్నటి సెషన్‌లో రూ.5000 మేర తగ్గిన కిలో వెండి రేటు ఇవాళ అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2,75,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగిన క్రమంలో దేశీయంగానూ ఆ ప్రభావం ఉంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.