ట్రంప్ తికమక ప్రకటనలు.. మళ్లీ ఎగబాకిన క్రూడాయిల్ ధరలు.. ఇంకెన్నాళ్లీ తిప్పలు..!

Wait 5 sec.

: యావత్ ప్రపంచం.. చెప్పొచ్చు. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా.. పలు దేశాలు సమస్యల వలయంలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. దీంతో బయట హోటళ్లలో టిఫిన్, భోజనం రేట్లు కూడా పెరిగాయి. స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయి. మ్యూచువల్ ఫండ్లలో నష్టాలు వస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తనదైన శైలిలో విచిత్ర, విభిన్న ప్రకటనలు చేస్తూ.. అయోమయంలోకి నెట్టేస్తున్నారు. ఆయన చేసే ఒక్కో ట్వీట్ లేదా పోస్టుతో నిమిషాల్లో భారీగా మారిపోతున్నాయి. పొద్దున యుద్ధం.. సాయంత్రం శాంతి అన్నట్లుగా ఆయన ప్రకటనల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ఏప్రిల్ 8న 2 వారాల అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా అడుగులు పడతాయని భావించారు. ఈ గడువు ముగుస్తున్న తరుణంలో ఏప్రిల్ 21న కాల్పుల విరమణ గడువు పొడిగించేది లేదని ప్రకటన చేశారు ట్రంప్. దీంతో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా 7 శాతానికిపైగా పెరిగి 93 డాలర్ల స్థాయి నుంచి 99 డాలర్ల మార్కుకు చేరింది. తెల్లారే సరికి మరో ప్రకటన వచ్చింది. ఇప్పుడు . ఎప్పటివరకని చెప్పలేదు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అయితే ఇక్కడా మరో ట్విస్ట్ ఉంది. హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ నౌకల రాకపోకలపై దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో క్రూడాయిల్ ధరలు తగ్గుతాయనుకుంటే.. అలా జరగకుండా స్థిరంగానే ఉన్నాయి. ఒకవైపు.. చర్చలు అంటూనే మరోవైపు ఇరాన్ నౌకలపై దిగ్బంధనం అంటూ.. ట్విస్టులు విధిస్తున్నారు. ఇరాన్‌పై మరికొన్ని రోజలు యుద్ధం చేస్తేనే దారికొస్తుందని.. అప్పుడే హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుస్తుందని చెబుతున్నారు. ఇటీవల కొన్ని ప్రకటనలు చూస్తే.. ఫిబ్రవరి 28 యుద్ధం ప్రారంభం కాగా.. క్రూడాయిల్ ధర అంతకుముందు 70 డాలర్ల స్థాయి దిగువన ఉండగా.. యుద్ధం సమయంలో 2-3 రోజుల్లోనే 120 డాలర్ల స్థాయికి ఎగబాకింది. ఇక . మళ్లీ ఇరాన్ వెనక్కి తగ్గకుంటే చరిత్రలో ఇరాన్ లేకుండా నాగరికతనే నాశనం చేస్తామని ప్రకటించగా.. 110 డాలర్లకు ఎగబాకింది. తర్వాత హార్ముజ్ జలసంధి చుట్టూ రాజకీయాలు నడిచాయి. కాల్పుల విరమణ, ఇరాన్ నౌకల దిగ్బంధనం ఇలా పొంతనలేని ఒక్కో ప్రకటన తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇది స్టాక్ మార్కెట్లలో కూడా అప్పటికప్పుడు లాభాలందిస్తుండగా.. మళ్లీ ట్రంప్ ప్రకటనలతోనే కుప్పకూలుతున్నాయి. ఇంకా బంగారం ధరలు కూడా ఊహకందని రీతిలో మారిపోతున్నాయి. ఇలా ఆయన నోటి నుంచే వచ్చే ఒక్కో మాట.. ప్రపంచ మార్కెట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది.