రోజూ అప్పర్ సర్క్యూట్ కొడుతున్న స్టాక్.. 10 రోజుల్లోనే 144 శాతం జంప్.. లక్షకు రూ. 2.44 లక్షలొచ్చాయ్!

Wait 5 sec.

: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చాలా రోజుల తర్వాత లాభాల్లో దూసుకెళ్తున్నాయి. గత కొద్ది రోజులుగా తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడయిన సంగతి తెలిసిందే. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని పెద్ద మొత్తంలో ఉపసంహరించుకోవడం వంటివి కారణాలుగా నిలిచాయి. అయితే ఇప్పుడు ఇయర్ ఎండ్‌లో.. డిసెంబర్ 31న భారత స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ఈ వార్త రాసే సమయంలో మధ్యాహ్నం 2 గంటలకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 650 పాయింట్లు పెరిగి 85,320 స్థాయిలో ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ చూస్తే 220 పాయింట్లు పుంజుకొని 26,160 స్థాయిలో కదలాడుతోంది. రిలయన్స్, ఎస్బీఐ, టాటా స్టాక్స్ సహా పలు హెవీ వెయిట్ స్టాక్స్ మంచి లాభాల్లో ఉన్నాయి. అయితే డిసెంబర్ నెలలో స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నా.. ఒక స్టాక్ మాత్రం కాసుల పంట పండించింది. వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్లు కొడుతోంది. అదే టీసీఐ ఫైనాన్స్ లిమిటెడ్. మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా ఈ స్టాక్ రాణిస్తూ వచ్చింది. అది కూడా మళ్లీ అప్పర్ సర్క్యూట్లే కొట్టింది. వరుసగా 10 సెషన్లుగా ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ కొట్టింది. దీంతో మొత్తం 10 రోజుల్లోనే 144.3 శాతం పెరిగింది. డిసెంబర్ 16న టీసీఐ ఫైనాన్స్ షేర్ ధర రూ. 11.20 గా ఉండగా.. అక్కడి నుంచి ప్రతి రోజూ 10 సెషన్లలో అప్పర్ సర్క్యూట్ కొడుతూ వచ్చింది. డిసెంబర్ 17న 20 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. మరుసటి రోజు కూడా 20 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. . ఇప్పుడు డిసెంబర్ 31 సెషన్‌లో కూడా 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. దీంతో ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 27.36 గా ఉంది. >> కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 35.22 కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 27.36 కాగా.. కనిష్ఠ ధర రూ. 10 గా ఉంది. ఇవాళ్టి సెషన్‌లో సుమారు 44 వేల షేర్లు ట్రేడయ్యాయి. ఈ క్రమంలో 10 సెషన్లలో 144 శాతం పెరగ్గా.. రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 2.44 లక్షలుగా మలిచింది. అంటే లక్ష పెట్టుబడిపై రూ. 1.44 లక్షల లాభం వచ్చింది.