ఏపీ పింఛన్ల పంపిణీలో ఇంట్రస్టింగ్ సీన్.. 9 మందికి ఒక్కరోజే రూ.18 లక్షలు డబ్బులు..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా బుధవారం (డిసెంబర్ 31) ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. జనవరి ఒకటో తేదీ సెలవు రోజు కావటంతో.. చేశారు. బుధవారం ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం12 గంటలకు 87 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. ఏపీ వ్యాప్తంగా 63.12 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2,743 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు పింఛన్లు పంపిణీ చేశారు.ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే లబ్ధిదారుల బాగోగులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నందిగాం మండలంలోని దీనబంధుపురంలో గతంలో 9 మందికి పింఛన్లు నిలిపివేశారు. అయితే కోర్టు ఆదేశాలతో వారి పింఛన్లు తిరిగి పునరుద్ధరించారు. అలాగే తొలగించిన రోజు నుంచి తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ 9 మంది లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పింఛన్ మొత్తాన్ని లెక్కేసి.. ఒకేరోజున వారందరికీ 18 లక్షల రూపాయలు పింఛన్ అందించారు. మంత్రి అచ్చెన్నాయుడు ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేశారు.చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు..మరోవైపు ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్దిదారులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. అందిస్తున్నామని.. మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 వేల కోట్లకుపైగా పింఛన్లపై ఖర్చు పెట్టామంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. డిసెంబర్ నెల కోసం 63.12 లక్షల మందికి పింఛను ఇచ్చేందుకు రూ.2743 కోట్లు విడుదల చేశామని.. జనవరి 1వ తేదీన పింఛను ఇవ్వాల్సి ఉన్నా కొత్త ఏడాది సందర్భంగా ఒక రోజు ముందే 31వ తేదీనే మీ ఇళ్ల వద్ద పింఛన్ పంచే ఏర్పాటు చేశామంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛను పంపిణీ తమకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం అని చంద్రబాబు పేర్కొన్నారు.