ఆరోపణలు కాదు ఆధారాలు కావాలి.. వరకట్న వేధింపుల కేసులో జీవిత ఖైదు శిక్షను కొట్టివేసిన హైకోర్టు

Wait 5 sec.

వరకట్న వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఉంటే సరిపోవని .. పక్కా ఆధారులండాని పక్కా ఆధారాలుంటేనే నిందితులకు శిక్షలు విధించటానికి వీలుంటదని స్పష్టం చేసింది. వికారాబాద్ జిల్లాలో 2011లో జరిగిన ఒక వివాహిత కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను కొట్టివేస్తూ.. నిందితులుగా ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యులను నిర్దోషులుగా ప్రకటించింది. జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం.. ప్రాసిక్యూషన్ నిందితులపై నేరాన్ని నిరూపించడంలో విఫలమైందని స్పష్టం చేస్తూ ఈ సంచలన తీర్పును వెలువరించింది.వివరాల్లోకి వెళితే.. 2011 ఆగస్టులో వివాహమైన 15 నెలలకే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. అదనపు వరకట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త వేధిస్తున్నారంటూ బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన వికారాబాద్ ట్రయల్ కోర్టు.. 2016లో ఆ ఐదుగురిని దోషులుగా తేల్చి వారికి జీవిత ఖైదు శిక్ష విధించింది. దీనిని సవాలు చేస్తూ నిందితులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 304-బి కింద ఒక నేరాన్ని పరిగణించాలంటే కొన్ని కీలక నిబంధనలు ఉండాలని గుర్తుచేసింది. కేవలం వేధింపుల ఆరోపణలు ఉంటే సరిపోదని.. మరణానికి కొద్దిసేపటి ముందు వరకట్నం కోసం వేధింపులు జరిగినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.ఈ కేసులో అదనపు వరకట్నం కోసం వేధించారని ఎలాంటి స్వతంత్ర సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించలేదని తెలిపింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన మొదటి స్టేట్‌మెంట్‌కు.. కోర్టులో చెప్పిన సాక్ష్యాలకు మధ్య భారీ వైరుధ్యాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. మరణానికి ముందు వేధింపులు జరిగినట్లు ఎక్కడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కనీసం పంచాయితీలు కూడా జరగలేదని బాధితురాలి తండ్రి అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసింది. నిందితుల్లో ఇద్దరైన ఆడపడుచు, ఆమె భర్త హైదరాబాద్‌లో వేరుగా నివసిస్తున్నారని వారు కేవలం పండుగ కోసమే ఊరికి వచ్చారని కోర్టు స్పష్టం చేసింది. వరకట్న వేధింపుల వల్లే ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందన్న వాదనను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తేల్చిన హైకోర్టు.. 2016 నాటి తీర్పును రద్దు చేస్తూ ఐదుగురు నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టింది.