వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్‌ అగ్రనేత వాద్రా కుమారుడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియాంక, , తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం జరగనున్నట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఏడేళ్లుగా ఇరువురి మధ్య స్నేహం ఉందని, అవీవా ముందు రైహాన్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా.. అందుకు ఆమె సమ్మతించినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఇరు కుటుంబాలు సోమవారం కలిసి మాట్లాడుకున్నట్టు సమాచారం. దీంతో బుధవారం రాజస్థాన్‌లోని రణతంబోర్ భారీ ఎత్తున నిశ్చితార్థ వేడుక జరుగుతుందని పేర్కొన్నాయి. పెళ్లి కొన్ని నెలల్లో జరుగుతుందని సమాచారం. కానీ, దీనిపై గాంధీ, వాద్రా కుటుంబాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.ఢిల్లీకి చెందిన అవీవా కుటుంబానికి వాద్రా కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తోంది. అవీవా తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపారవేత్త, తల్లి నందిత బేగ్ ఇంటీరియర్ డిజైనర్., నందితలు పాత స్నేహితులు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ ఇంటీరియర్ డిజైన్ విషయంలో ప్రియాంకా గాంధీకి నందిత సహకారం అందించారు. ముందునుంచి రెండు కుటుంబాల మధ్య పరిచయం ఉందని, రైహాన్, అవీవా ఒకే స్కూల్‌లో చదువుకున్నారని దీని గురించి తెలిసిన వర్గాలు తెలిపారు.చిన్నప్పటి నుంచి రైహాన్‌కు ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. కుమారుడి అభిరుచికి అనుగుణంగా ప్రియాంక, రాబర్ట్ వాద్రాలో ఆ రంగంలో అతడిని ప్రోత్సహించారు. విజువల్‌ ఆర్టిస్ట్‌. వైల్డ్‌లైఫ్‌, స్ట్రీట్‌, కమర్షియల్‌ ఫొటోగ్రఫీతో రైహాన్ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2021లో ఢిల్లీలోని బికనేర్ హౌస్‌లో ‘డార్క్‌ పర్సెప్షన్‌’ పేరుతో తొలి ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. అవీవా కూడా ఫొటోగ్రాఫర్‌, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.రైహాన్ విద్యాభ్యాసం తన తాత రాజీవ్ గాంధీ, మేనమామ రాహుల్ గాంధీ చదువుకున్న డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లో జరిగింది. అనంతరం ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లారు. స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో పాలిటిక్స్‌లో డిగ్రీ చదివారు. ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే రైహాన్ పదేళ్ల వయసు నుంచే హాబీగా మార్చుకున్నాడు. 2017లో స్కూల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కంటికి గాయం అయిన తర్వాత కాంతి, స్థలం, సమయంతో అతడి అనుభవాలను ఈ ఎగ్జిబిషన్‌లో కళ్లకు కట్టారు. ‘ కంటికి జరిగిన ప్రమాదం తర్వాత నా దృక్పథం మారిపోయింది.. అప్పటి నుంచి నేను బ్లాక్ అండ్ వైట్స్‌లో షూట్ చేయడం ప్రారంభించాను.. చీకటి అనే భావనను ఉపయోగించుకుని వెలుగును అన్వేషించడమే నా ప్రయత్నం’ అని అన్నారు.