ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణరాజుకు కీలక పదవి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..

Wait 5 sec.

ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు.. డాక్టర్ మంతెన సత్యనారాయణరాజును కీలక పదవిలో నియమించింది. మంతెన సత్యనారాయణరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రకృతి వైద్య సలహాదారుగా మంతెన సత్యనారాయణరాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైద్యుడిగా మంతెన సత్యనారాయణరాజుకు మంచి పేరుంది. అలాగే ఉండవల్లిలో కరకట్ట వద్ద ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేసి ప్రజలకు మంతెన సత్యనారాయణరాజు సేవలు అందిస్తున్నారు.ప్రకృతి వైద్యంలో మంతెన సత్యనారాయణరాజుకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అందులో భాగంగానే ఏపీ ప్రకృతి వైద్య సలహాదారుడిగా ఆయనను నియమించింది. మంతెన సత్యనారాయణరాజుకు విజయవాడతో పాటు మరో రెండు చోట్ల కూడా ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి. వీటి ద్వారా ప్రకృతి వైద్యం ద్వారా ఆయన రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వైద్యంలో మంతెన సత్యనారాయణరాజు సలహాలు, సూచనలు తీసుకునేందుకు.. ఏపీ ప్రభుత్వం ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణరాజు జీతభత్యాలకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. వీటి కోసం ప్రత్యేకంగా మరో జీవో తీసుకురానున్నారు.మరోవైపు ఏపీ ప్రభుత్వం గతంలోనూ వివిధ రంగాలకు చెందిన పలువురిని సలహాదారులుగా నియమించుకుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ప్రవచనకర్త నియమించుకుంది. 2024 నవంబర్ నెలలో చాగంటి కోటేశ్వరరావును తో ఏపీ ప్రభుత్వం నియమించుకుంది. విద్యార్థులలో నైతిక విలువను పెంపొందించాల్సిన గురుతర బాధ్యతను అప్పగించింది.అనంతరం చాగంటి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే కూడా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. పెద్దల పట్ల గౌరవం, సంఘం పట్ల బాధ్యత, క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పేలా ఈ పుస్తకాలను తయారు చేశారు. విలువల విద్య పేరుతో తయారు చేసిన ఈ పుస్తకాలను ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులక వరకూ అందజేశారు.