: 2025 సంవత్సరంలో కార్ల టోకు విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2024లో ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 43.05 లక్షలు కాగా.. గతేడాది ఇది 6 శాతం పెరిగి 45.5 లక్షలకు చేరుకున్నాయి. . ఇంకా సెస్ తొలగించింది. దీంతో దాదాపు అన్ని కార్ల తయారీ కంపెనీలు ఈ మేరకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల్ని కస్టమర్లకు వెంటనే బదిలీ చేశాయి. ఇంకా అదనంగా డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో అందుబాటు ధరల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే కార్ల కొనుగోలుదారుల సంఖ్య పెరిగింది. మరి జనం గతేడాది డిసెంబరులో అలాగే.. ఏడాది మొత్తంలో ఏ కారు మోడల్ ఎక్కువగా కొనుగోలు చేశారో చూద్దాం. ఏ కారు ఎక్కువగా సేల్ అయింది.. ఎక్కువ మందిని ఆకర్షించిన కారు ఏంటనేది తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. >> గతేడాది డిసెంబర్ నెల డేటా చూస్తే.. మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ బాలెనో టాప్‌లో నిలిచింది. డిసెంబరు నెలకు గానూ బెస్ట్ సెల్లింగ్ కారుగా ఇదే నిలిచింది. ఒక్క నెలలోనే ఏకంగా 22,108 యూనిట్లను విక్రయించింది. ఇక్కడ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ (20,700 యూనిట్లు), టాటా నెక్సాన్ (19,400 యూనిట్లు) వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీల్ని కూడా అధిగమించడం విశేషం. ఇక ఉంది. ఇది కాంపాక్ట్ సెడాన్ మోడల్ కావడం విశేషం. ఏడాది మొత్తంలో డిజైర్ వేరియంట్లను రికార్డు స్థాయిలో 2.14 లక్షల మంది కొనుగోలు చేశారు. ఏడాదిలో ఎక్కువగా అమ్ముడైన కార్లలో ఒక సెడాన్ మోడల్ టాప్‌ ప్లేసు‌లో నిలవడం 41 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 2018లో కూడా డిజైర్ టాప్‌లో నిలిచింది. డిజైర్ టాప్ ప్లేసులో నిలిచే క్రమంలో.. హ్యుందాయ్ పాపులర్ మిడ్ సైజ్ SUV మోడల్ క్రెటాను (2,01,000 యూనిట్లు) దాటేయడం విశేషం. ఎక్స్ షోరూం ధరలు రూ. 5,98,900 నుంచి రూ. 9,09,900 మధ్య ఉన్నాయి. ఇవి వేరియంట్లను మారుతుంటాయని చెప్పొచ్చు. ఇక డిజైర్ ధర విషయానికి వస్తే ూ. 6,25,600- రూ. 9,31,300 మధ్య ఉన్నాయి. జీఎస్టీ రేట్ల కోత నేపథ్యంలో బాలెనో వేరియంట్స్ ధరలు రూ. 86,100 వరకు తగ్గాయి. డిజైర్ ధర రూ. 87,700 వరకు తగ్గాయి. రేటింగ్ సంగతి చూస్తే.. సుజుకీ హర్టెక్ట్ ప్లాట్‌ఫాం ప్రకారం భారత్ NCAP వద్ద బాలెనో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకుంది. ఇక డిజైర్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ఉంది.