పాకిస్తాన్ వివాదంలో చిక్కుకున్నాడు. వసీంపై అతడి మాజీ భార్య సానియా అష్ఫక్‌ సంచలన ఆరోపణలు చేసింది. భర్తతో విడిపోవడానికి గల కారణాలను చెప్పింది. విడాకులు తీసుకున్న విషయాన్ని వసీం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న నేపథ్యంలో సానియా అష్ఫక్‌ ఈ ఆరోపణలు గుప్పించింది. మూడో వ్యక్తి కారణంగానే తమ కాపురం కుప్పకూలిందని చెప్పుకొచ్చింది సానియా. ప్రస్తుతం ఈ విషయం పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇమాద్ వసీం, సానియా అష్ఫక్‌ 2019లో ఆగస్టు 26న ఇస్లామాబాద్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 5 నెలల చిన్నారి సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చివరికి అవి విడాకులకు దారి తీశాయి. తాజాగా సానియా ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టింది. ప్రతీ ఇంట్లో మాదిరిగానే భార్యాభర్తలుగా తమ మధ్య కొన్ని విభేదాలు ఉన్నా.. ఒక భార్య, తల్లిగా వివాహ బంధానికి కట్టుబడి ఉన్నానని సానియా తెలిపింది. తన కాపురాన్ని నిలబెట్టుకునేందుకు వంద శాతం ప్రయత్నించానని పేర్కొంది. కానీ మూడో వ్యక్తి వల్లే తమ బంధం విడాకుల దాకా వచ్చిందని సంచలన ఆరోపణ చేసింది.ఆమె వల్లే నా కాపురం కూలింది.."నేను బాధతో ఈ పోస్టు పెడుతున్నాను. నా ఇల్లు ఛిన్నాభిన్నమైంది. నా పిల్లలు తండ్రికి దూరమయ్యారు. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. వారిలో ఐదు నెలల పసికందు కూడా ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి వాడిని.. వాళ్ళ నాన్న ఎత్తుకోలేదు. అసలు ఇదంతా నేను చెప్పాలని అనుకోలేదు. కానీ నా మౌనాన్ని ఎప్పుడూ బలహీనతగా భావించకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా. అందరి లాగే.. మా దాంపత్యం జీవితంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయినా అది కొనసాగింది. నేను భార్యగా, తల్లిగా నా బాధ్యతలకు కట్టుబడి ఉన్నాను. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నిజాయితీగా ప్రయత్నించాను. కానీ చివరికి మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మా కాపురం కూలింది. ఆమె నా భర్తను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది. అందుకే అతడిని నాకు దూరం చేసింది. అప్పటికే కష్టాల్లో ఉన్న మా బంధానికి.. ఆమె చివరి దెబ్బ కొట్టింది" అని సానియా అష్ఫక్‌ ఆవేదన వ్యక్తం చేసింది.వివాహ బంధంలో ప్రతీసారి ఘర్షణ పడేకంటే.. విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించి.. విడాకులకు అప్లై చేసినట్లు తెలిపింది సానియా అష్ఫక్‌. ఇక తన పిల్లలకు తాను తండ్రిని అని.. వారి బాధ్యత మొత్తం తనదే అని పేర్కొంది. ఇలాంటి సమయంలో తన గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాట్లు తెలిపింది సానియా. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఎవరైనా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.కాగా, ఇమాద్ వసీం పాకిస్తాన్‌ తరఫున 55 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లు ఆడి.. వన్డేల్లో 986, టీ20లలో 554 పరుగులు చేశాడు. ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా వన్డేల్లో 44, టీ20లలో 73 వికెట్లు పడగొట్టాడు. 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు ఇమాద్‌ వసీం.