హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు బిగించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గృహ, వాణిజ్య అవసరాల కోసం విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఈ ఏడాది మార్చి నెల నాటికి దాదాపు 20 కొత్త సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వేసవి కాలంలో లోడ్ పెరిగినా వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా వీటిని తీసుకొని రానున్నారు. డిస్కం అధికారులు చేపట్టిన ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా నగరం నలుమూలలా 33/11 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలైన షాపూర్‌నగర్, అత్తాపూర్, సాయినగర్, భవానీనగర్ వంటి చోట్ల 7 సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి జోన్ పరిధిలోని మోకిల, కోహెడ, కొంగర కలాన్ వంటి ప్రాంతాలతో పాటు మేడ్చల్ జోన్‌లోని బోడుప్పల్, మియాపూర్, శంబీపూర్ వంటి చోట్ల కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో ముర్తుజాగూడ, షాపూర్‌నగర్ సబ్‌స్టేషన్లు ఇప్పటికే విద్యుత్ ప్రసారానికి సిద్ధంగా ఉన్నాయి.నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు వీలుగా ప్రతి ప్రాంతంలో కంట్రోల్ రూమ్‌లను నిర్మించారు. భూగర్భ కేబుల్స్ ఏర్పాటు, స్విచ్ గేర్ అమరిక వంటి కీలకమైన పనులు తుది దశకు చేరుకున్నాయి. వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జనవరి 31 నాటికే చాలా వరకు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కొత్త వ్యవస్థల వల్ల లో వోల్టేజీ సమస్యలు తగ్గడమే కాకుండా.. విద్యుత్ సరఫరాలో స్టెబిలిటీ పెరుగుతుంది.హైదరాబాద్‌ లో ఐటీ రంగా విస్తరణ, నూతన అపార్ట్‌మెంట్ల 10 శాతం నుంచి 15 శాతం పెరుగుతోంది. గత వేసవిలో నమోదైన గరిష్ట డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. రాబోయే ఎండల తీవ్రతను తట్టుకునేలా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నారు. ఈ 20 కొత్త సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వస్తే గ్రేటర్ పరిధిలోని లక్షలాది మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది.