మీ దగ్గర రూ. 10 లక్షలున్నాయా? 2026లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి.. నిపుణులేం చెబుతున్నారు?

Wait 5 sec.

Equity Mutual Funds: మీరు సంపాదించిన దాంట్లో నుంచి ఏమైనా పొదుపు చేస్తున్నారా? లేదా ఉన్నదంతా ఖర్చయిపోతుందా? అసలు ఎలాంటి ప్లాన్ లేదా.. డబ్బులు ఉన్నా బీరువాలోనో, సేవింగ్స్ అకౌంట్లలోనో ఉంచుతున్నారా? ఇలా చేస్తే మీకొచ్చిదీ ఏమీ ఉండదు. అంతా వృథానే. ఇలా ఉంచితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో మీ దగ్గర ఉన్న డబ్బు విలువ కాల క్రమేణా తగ్గిపోతుంది. కొందరికి ఇక్కడ డబ్బు ఆదా చేసి.. పెట్టుబడులు పెట్టాలని ఉన్నప్పటికీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఆగిపోతుంటారు. వీరు కూడా మారాల్సిన సమయం వచ్చింది. ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకొని తమ పెట్టుబడి.. ఆర్థిక స్థోమత, రిస్క్ సామర్థ్యాలు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రిస్క్ ఉంటుంది కాబట్టి.. ఇక్కడ నిపుణుల నుంచి సరైన సలహాలు తీసుకోవాలి. వారి పర్యవేక్షణ ఎంతో అవసరం.సాధారణంగా చాలా మంది ఇక్కడ 50:30:20 రూల్ పాటిస్తుంటారు. అంటే 50 శాతం అద్దె, కిరాణా, ఇతర బిల్లులు వంటి అవసరాలకు, 30 శాతం వరకు కోరికలు, ప్రయాణాలు, వినోదం కోసం కేటాయించాలని చెబుతుంటారు. ఇంకా 20 శాతం లేదా 30 శాతం వరకు కచ్చితంగా పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అయితే ఇలా లేకుంటే మీ దగ్గర లంప్ సమ్ (పెద్ద మొత్తం) ఉంటే ఒకేసారి దీనిని ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలనేది కూడా నిపుణులు సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు కాస్త దూకుడైన ఇన్వెస్టర్లు తమ దగ్గర రూ. 10 లక్షల అమౌంట్ ఉంటే.. 2026లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దానిపై ఆర్థిక నిపుణులు కీలక సలహాలు ఇచ్చారు. దీనిని ఈటీ బ్యూరో రిపోర్ట్ చేసింది. ఇందులో చాలా వరకు నిపుణులు ఏకాభిప్రాయంతో చెబుతున్నారు. 2025లో స్టాక్ మార్కెట్ పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నా.. వీరు మ్యూచువల్ ఫండ్స్‌పై సానుకూలంగానే ఉన్నారు. వెంచురా సెక్యూరిటీస్ డైరెక్టర్ జుజెర్ గబాజీవాలా ప్రకారం.. కనీసం 65 శాతం వరకు ఈక్విటీ ఫండ్స్, 15 శాతం ఇంటర్నేషనల్ ఈక్విటీలకు కేటాయించాలని చెబుతున్నారు. ఇక్కడ కొన్ని ఫండ్ సూచనలు కూడా చెబుతున్నారు. రూ. 3 లక్షలు నిప్పన్ ఇండియా మల్టీక్యాప్, రూ. 1.5 లక్షలు HDFC స్మాల్ క్యాప్, రూ. 2 లక్షలు కోటక్ మిడ్ క్యాప్, రూ. 1.5 లక్షలు కోటక్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఓవర్సీస్ ఈక్విటీ FoF లకు కేటాయించాలని అంటున్నారు. అగ్రెసివ్ ఇన్వెస్టర్లకు డెట్ ఫండ్స్‌ అవసరం లేదని.. . ఇందుకోసం మిరే అసెట్ గోల్డ్ సిల్వర్ పాసివ్ ఎఫ్ఓఎఫ్ స్కీమ్ గురించి చెప్పారు. SIFT క్యాపిటల్ ఫౌండర్ వినీత్ నందా ప్రకారం.. 85 శాతం ఈక్విటీ, 5 శాతం ఇంటర్నేషనల్ ఈక్విటీలకు కేటాయించాలని సూచిస్తున్నారు. ఈయన కూడా డెట్ ఫండ్స్ అవసరం లేదని.. 10 శాతం మేర గోల్డ్, సిల్వర్ ఫండ్స్‌కు కేటాయించాలని సూచిస్తున్నారు. Fisdom రీసెర్చ్ హెడ్ నీరవ్ కార్కేరా 90 శాతం ఈక్విటీలకు కేటాయించాలని సూచిస్తున్నారు. 10 శాతం మేర గోల్డ్, సిల్వర్ కోసం ఎడెల్‌వీస్ సిల్వర్ ఈటీఎఫ్, నిప్పన్ గోల్డ్ ఈటీఎఫ్ స్కీమ్స్ ఎంచుకోవాలని సలహాలు ఇస్తున్నారు. గమనిక: పైన చెప్పింది కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది కేవలం ఆర్థిక నిపుణుల అభిప్రాయాల్ని మాత్రమే తెలియజేస్తుంది. మెరుగైన రిటర్న్స్ కోసం.. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌ను సంప్రదించడం మంచిది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి సామర్థ్యం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండాలి.