Today: కొత్త సంవత్సరంలో జోరుమీదున్నాయి. . ఒకవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడంతో విదేశీ మదుపరులు తమ పెట్టుబడుల్ని భారీగా ఉపసంహరించుకున్నారు. అయితే కొత్త సంవత్సరంలో మాత్రం సానుకూలంగానే కదలాడుతున్నాయి. జనవరి 1న సూచీలు ఫ్లాట్‌గా ముగియగా.. రెండో తేదీన మాత్రం దూసుకెళ్తున్నాయి. ఈ వార్త రాసే సమయంలో జనవరి 2న మధ్యాహ్నం 1.45 గంటలకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ ఏకంగా 480 పాయింట్ల లాభంతో 85,670 స్థాయిలో ఉండగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 155 పాయింట్లు పుంజుకొని ప్రస్తుతం 26,310 స్థాయిలో ట్రేడవుతోంది. అధిక మార్కెట్ విలువ ఉన్న కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి మొదలుకొని ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీ స్టాక్స్ ఇలా అన్నింట్లో ఇన్వెస్టర్లు షేర్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్ పుంజుకుంటంది. ఇక్కడే మనం ఒక ప్రముఖ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. అదే రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు సహా ఆటోమోటివ్ పార్ట్స్, పవర్ టూల్స్, ఇతర గృహోపకరణాల తయారీ, విక్రయదారుగా ఉన్న బాష్ లిమిటెడ్. ఇది శుక్రవారం సెషన్‌లో రికార్డు స్థాయిలో పుంజుకుంది. కిందటి రోజు బాష్ షేర్ ధర రూ. 36,140 వద్ద ముగియగా.. ఇవాళ ఆరంభంల ో స్వల్ప లాభంతో రూ. 36,170 వద్ద ఓపెన్ అయింది. ఆ తర్వాత భారీగా పెరిగింది. మార్కెట్ లాభాల్లో ఉండటం సహా ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు 2025 డిసెంబర్ నెలకు సంబంధించి.. నెలవారీ విక్రయాల డేటాను ప్రకటించాయి. ఇక్కడ రికార్డు స్థాయిలో వాహనాల్ని విక్రయించగా.. వాటి అనుబంధ కంపెనీలైన బాష్ వంటి షేర్లు పుంజుకుంటున్నాయి. దీనితో పాటే సమర్థన మదర్‌సన్, సోనా BLW, యునో మిండా వంటి ఇతర ఆటో అనుబంధ స్టాక్స్ రాణిస్తున్నాయి. బాష్ షేర్ ధర చూస్తే.. శుక్రవారం సెషన్‌లో ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో ఏకంగా రూ. 3060 పుంజుకొని రూ. 39,200 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఒక్కరోజులోనే షేర్ ధర 9 శాతం వరకు పెరిగింది. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రిటర్న్స్ అందాయి. అంటే కనీసం ఒక్క షేరు కొనుగోలు చేసినా వారికి రూ. 3 వేలకుపైగా లాభం వచ్చిందన్నమాట. ఇక కంపెనీ మార్కెట్ విలువ చూస్తే ప్రస్తుతం రూ. 1.15 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 41,945 కాగా.. కనిష్ఠ ధర రూ. 25,921.60 గా ఉంది. గత 3 రోజులుగా ఈ స్టాక్ రాణిస్తూనే ఉంది. ఐదేళ్లలో ఈ స్టాక్ ధర 200 శాతానికిపైగా పెరిగింది.