హైదరాబాద్ విజయవాడ హైవేపై ఫ్రీ టోల్.. ఏపీ నుంచి కేంద్రానికి రిక్వెస్ట్..

Wait 5 sec.

సంక్రాంతి పండుగ వేళ.. తెలుగు రాష్ట్రాలలో ఫ్రీ టోల్ అంశంపై చర్చ జరుగుతోంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీ వాసులు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి తరలి వెళ్తుంటారు. ముఖ్యంగా విజయవాడ మీదుగా కోస్తా జిల్లాలకు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో మీద ఉన్న టోల్ ప్లాజాలు ఈ సమయంలో కిక్కిరిసిపోతుంటాయి. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి.. పండగకు తొందరగా వెళ్లాలన్న ఆశను నీరుగారిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండగ నేపథ్యంలో ఫ్రీ టోల్‌కు అనుమతించాలంటూ టీడీపీ ఎంపీ సానా సతీష్.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సానా సతీష్ విజ్ఞప్తి చేశారు. "సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య ప్రయాణించే లక్షలాది మందికి ఊరట కల్పించాలని, పండుగ వారం రోజులు ఈ మార్గంలో టోల్ వసూళ్లు రద్దు చేసి ‘టోల్ ఫ్రీ’ ప్రయాణానికి అనుమతివ్వాలని గౌరవనీయ కేంద్ర రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని కోరుతున్నాను. పై పతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, కీసర టోల్ ప్లాజాల వద్ద పండుగ రద్దీతో నిలిచిపోతోంది. కావున దయచేసి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేవారి ప్రయాణాన్ని సుఖమయం చేయాల్సిందిగా విజ్ఞాప్తి చేస్తున్నాను. ఈ పండుగ సమయంలో మీరు చేసే ఉపకారం తెలుగు ప్రజలు ఎప్పటికి మరచిపోరు." అంటూ ఏపీ ఎంపీ సానా సతీష్ ట్వీట్ చేశారు. మరోవైపు సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. హైదరాబాద్‌లో సెటిలైన ఏపీ వాసులు.. సొంతూర్లకు బయల్దేరతారు. దీంతో రైళ్లు, బస్సులు నిండిపోతుంటాయి. అలాగే ప్రైవేట్ వాహనాలలో, సొంత వాహనాలలోనూ చాలా మంది సొంతూర్లకు బయల్దేరుతుంటారు. ఇలా వెళ్లేవారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోతూ ఉంటుంది. ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద.. టోల్ ఫీజు చెల్లింపుల కోసం వాహనాలు బారులు తీరుతుంటాయి. ఈ రద్దీని నివారించడానికి జనవరి 9 నుంచి 14 వరకు ఈ మార్గంలో టోల్ ఫీజు లేకుండా అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ రాశారు. తాజాగా ఏపీ ఎంపీ సానా సతీష్ సైతం విజ్ఞప్తి చేయడంతో.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదీ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే పండగకు ఊరెళ్లేవారికి బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు. టోల్ గేట్ల వద్ద గంటల కొద్దీ నిరీక్షించే అవసరం తప్పుతుంది.