పాన్- ఆధార్ నుంచి యూపీఐ వరకు.. జనవరి కొత్త రూల్స్ ఇవే.. మీ జేబుకు చిల్లుపడొచ్చు!

Wait 5 sec.

: సాధారణంగా ప్రతి నెలా ఎన్నో కొత్త ఆర్థిక, విధాన పర నిర్ణయాలు అమల్లోకి వస్తుంటాయి. అంటే ఇక్కడ కొత్త రూల్స్ అమల్లోకి వస్తుంటాయి. కొన్నింటి డెడ్‌లైన్స్ ముగుస్తుంటాయి. కొన్నింటికి కొత్త రేట్లు వర్తిస్తాయి. ఇలా ఎన్నో మారుతుంటాయి. ఇప్పుడు 2025 సంవత్సరం ముగిసింది. 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టాం. దీంతో ఇక్కడ కూడా ఎన్నో ఆర్థిక, విధాన నిర్ణయాలు మారాయి. కొత్త రూల్స్ జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి కూడా. ముందుగా.. ఇక్కడ పాన్- ఆధార్ కార్డు లింకింగ్ గురించి మాట్లాడుకోవాలి. పాన్ కార్డుతో ఆధార్ కచ్చితంగా లింక్ చేసుకోవాలి. దీనికి గడువు డిసెంబర్ 31తోనే ముగిసింది. బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల్ని పొందాలంటే ఈ రెండు అనుసంధానం చేయాల్సిందే. ఈ పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందేందుకు కూడా వీలుండదు. ఈ రెండింటినీ లింక్ చేయని పాన్ కార్డులు ఇక నుంచి చెల్లుబాటు కావు. అపరాధ రుసుము రూ. 1000 చెల్లించి ఇన్‌కంటాక్స్ ఇ- ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆధార్ పాన్ లింక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మోసాల్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం.. యూపీఐ ట్రాన్సాక్షన్లపై పర్యవేక్షణ పెంచనుంది. దీంతో పాటు టెలిగ్రామ్, సిగ్నల్, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్ కోసం సిమ్ వెరిఫికేషన్ నిబంధనల్ని కఠినతరం చేసింది. ఇక్కడ మోసపూరిత కార్యకలాపాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా ప్రముఖ బ్యాంకులు.. తమ డెబిట్, క్రెడిట్ కార్డు నిబంధనల్ని సవరిస్తున్నాయి. ఎస్బీఐ కార్డు జనవరి 10 నుంచే కొత్త డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ షురూ చేస్తోంది. HDFC బ్యాంక్ డెబిట్ కార్డు వినియోగదారుల కోసం స్పెండింగ్ లిమిట్ ఆధారంగా వోచర్ పద్ధతి తీసుకొస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు ఆన్‌లైన్ గేమింగ్ ట్రాన్సాక్షన్స్, బుక్‌మైషో ద్వారా లభించే రివార్డ్ పాయింట్ నిబంధనల్ని మారుస్తోంది. ఇక్కడ రవాాణా సంబంధిత లావాదేవీలపై ఒక పరిమితి దాటితే ఒక శాతం అదనపు రుసుము వసూలు చేయనుంది. ఈ ఏడాదిలో రానున్న మరో కీలక మార్పు.. దశాబ్దాల నాటి ఇన్‌కంటాక్స్ చట్టం- 1961 స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం- 2025.. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పన్ను చట్టాన్ని మరింత సరళంగా, సులభతరంగా మార్చడమే దీని ఉద్దేశం. గతంలో చేసేవి. ఇప్పుడు ఇక ప్రతి వారం వారం దీన్ని అప్డేట్ చేయనున్నాయి. దీని వల్ల ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోరుపై వెంటనే ప్రభావం పడుతుంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తగ్గిన నేపథ్యంలో.. ఇంకా తయారీ ఖర్చులు పెరగడం కారణంగా కార్ల ధరల్ని జనవరి 1 నుంచి పెంచుతున్నట్లు పలు కంపెనీలు ప్రకటించాయి. ఇది మీ జేబుకు చిల్లు పడేలా చేస్తుందని చెప్పొచ్చు. ఇందులో హ్యుందాయ్ మోటార్ ఇండియా, రెనో ఇండియా, జేఎస్‌డబ్ల్యూ MG మోటార్, మెర్సిడెంజ్ బెంజ్, BMW వంటివి ఉన్నాయి. ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించనున్నాయని చెప్పొచ్చు. ఇంకా టాక్స్‌పేయర్లకు కొత్త ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడ ఖర్చుల వివరాలు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ముందుగానే భర్తీ చేసి ఉంటాయి. దీంతో రిటర్న్స్ ప్రాసెస్ మరింత సులభం కానుంది. వీటితో పాటు కొత్త ప్రమాణాల ప్రకారం తయారయ్యే ఏసీల ధరలు 10 శాతం వరకు, ఫ్రిడ్జ్ ధరలు 5 శాతం వరకు పెరగనున్నాయి. జనవరి 1న చేరింది. గృహ వినియోగ వంట గ్యాస్ ధర మాత్రం మారలేదు.