ట్యాక్స్ పేయర్లూ గడువు ముగిసినా నో టెన్షన్.. ఇప్పటికీ రీఫండ్ పొందొచ్చు.. ఎలాగంటే!

Wait 5 sec.

: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్. గత ఆర్థిక సంవత్సరం 2024-25 (అసెస్మెంట్ ఇయర్ 2025-26)కు సంబంధించిన రివైజ్డ్ ఐటీఆర్, బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు డిసెంబర్ 31, 2025తో ముగిసింది. ట్యాక్స్ పేయర్లు సెప్టెంబర్ 16,2025లోపు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే వారు ఫైల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు అసలు ఐటీఆర్ ఫైల్ చేయని వారు బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఇప్పుడు ఈ గడువు సైతం ముగిసిపోయింది. దీంతో చాలా మంది ట్యాక్స్ పేయర్లు ఆందోళన చెందుతుంటారు. తమ రీఫండ్ పోయినట్లేనని అనుకుంటారు. అయితే, ఇప్పటికీ మరో అవకాశం ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం. ట్యాక్స్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత సెక్షన్ 143(1) కింద ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత సమాచారం ఇస్తారు. అలాగే ఏవైనా తప్పులు ఉన్నట్లయితే ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం ఉంటుంది. అంటే గడువు దాటినప్పటికీ తప్పులు సరి చేసుకుని రీఫండ్ క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రాసెస్ పూర్తయిన తర్వాత తప్పులు ఉన్నట్లు సమాచార నోటీసులు అందుకున్న ట్యాక్స్ పేయర్లకు అవకాశం ఉంటుంది. సదరు ట్యాక్స్ పేయర్లు సెక్షన్ 154 కింద రెక్టిఫికేషన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. లెక్కల్లో లోపాలు, నష్టాలను తప్పుగా చూపించడం, తప్పు పన్ను లేదా వడ్డీ గణన, TDS క్రెడిట్‌ల అసమతుల్యత లేదా CPC సమాచారంలో ప్రతిబింబించే ఇతర క్లరికల్ తప్పులు వంటి రికార్డు నుంచి స్పష్టంగా కనిపించే తప్పులు ఉన్న చోట దిద్దుబాటు అభ్యర్థనలు అనుమతిస్తారు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డెడ్‌లైన్ మిస్ అయిన వారు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ వారు తమ తప్పులను సరిచేసుకోవచ్చు. ఈ ఆప్షన్ డిసెంబర్ 31, 2025 తర్వాత సైతం అందుబాటులో ఉంటుంది. ఇది రికార్డుల్లోని తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ ప్రాసెస్ చేయడం ద్వారా రీఫండ్స్ క్లెయిమ్ చేయడం లేదా రీఫండ్స్ పెరిగేందుకు అవకాశం లభిస్తుంది. సెక్షన్ 139(5) కింద సవరించిన రిటర్న్ దాఖలు చేయడానికి గడువు ముగిసిన తర్వాత, ఐటీఆర్‌ను CPC ఇప్పటికే ప్రాసెస్ చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారు స్పష్టమైన లోపాన్ని గుర్తిస్తే, పన్ను చెల్లింపుదారుడు ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సెక్షన్ 154 కింద సరిదిద్దే దరఖాస్తును దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ విధానం డిసెంబర్ 31, 2025 తర్వాత కూడా అందుబాటులో ఉంటుంది, సెక్షన్ 154 కింద సూచించబడిన పరిమితి కాలానికి లోబడి ఉంటుంది, అటువంటి పరిస్థితులను పరిష్కరించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.