ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కానే కాదు.. 2025లో ఇదే టాప్ స్కీమ్.. లక్ష పెడితే ఇంత లాభం వచ్చిందా?

Wait 5 sec.

: గత సంవత్సరం స్టాక్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. చాలా వరకు ఒడుదొడుకుల్లోనే ట్రేడయ్యాయి. అయితే .. మార్కెట్లలో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ మాత్రం అదిరిపోయే రిటర్న్స్ అందించాయి. అందరిలోనూ ఉంటుంది. మరి ఇందులో 2025కు గానూ అత్యధిక రాబడి అందించిన పథకం గురించి చూద్దాం. ఇది మన దగ్గర టాప్ ఫండ్ హౌస్‌లుగా ఉన్నటువంటి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఉన్నాయనుకుంటే పొరపాటే. అవును.. ఇవేమీ కావు.. ఒక ఇంటర్నేషనల్ ఫండ్ గత సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో అధిక రాబడి అందించింది. అదే . ఇది మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ది ఇయర్ 2025 టైటిల్ గెల్చుకుంది. ఏకంగా వార్షిక ప్రాతిపదికన 55.24 శాతం రిటర్న్స్ అందించింది. ఈ పథకం విషయానికి వస్తే ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్. ఇది హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్- బ్రెజిల్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పథకంలో గతేడాది తొలిరోజున నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ పెట్టుబడి ప్రారంభించిన వారికి 46.45 శాతం మేర XIRR రిటర్న్స్ అందించింది. ఇక్కడ మొత్తం రూ. 1.20 లక్షల పెట్టుబడికిగానూ ఏడాదిలోనే రూ. 1.48 లక్షలు వచ్చాయి. ఇంకా లంప్ సమ్ పెట్టుబడులపై అంతకంటే ఎక్కువ రిటర్న్స్ రావడం విశేషం. ఇక్కడ 2025, జనవరి 1న రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి 55.24 శాతం CAGR రిటర్న్స్ అందించింది. ఇక్కడ రూ. 1 లక్ష పెట్టుబడి కాస్తా రూ. 1.55 లక్షలైంది. అంటే లక్షపై ఏడాదిలోనే రూ. 55 వేలకుపైగా లాభం వచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకున్నారు. ఈ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ (AUM) కూడా గతేడాది 645 శాతం పెరిగి రూ. 40.68 కోట్ల నుంచి.. రూ. 303.13 కోట్లకు చేరుకుంది. సగటు మార్కెట్ విలువ (NAV) కూడా 54 శాతం పెరిగి రూ. 5.80 నుంచి రూ. 8.93 కు చేరింది. దీర్ఘకాలంలో పెట్టుబడులపై మంచి రిటర్న్స్ అందించే లక్ష్యంతో ఈ స్కీమ్ వచ్చింది. ఈ పథకం పనితీరుకు MSCI బ్రెజిల్ 10/40 ఇండెక్స్ TRI కొలమానంగా ఉంది. సోనాల్ గుప్తా ఈ ఫండ్ మేనేజర్‌గా ఉన్నారు. ఇందులో కనీసం రూ. 5 వేల పెట్టుబడితో చేరొచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితి లేదు.