తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు మార్కెట్ విలువల సవరణను తాత్కాలికంగా నిలిపివేయడం.. బిల్డర్లలో మనోధైర్యాన్ని నింపేలా సానుకూల నిర్ణయాలు తీసుకోవడం వంటి అనేక చర్యలు చేపట్టింది. అయినప్పటికీ.. రాష్ట్రంలో నుండి పూర్తిగా బయటపడలేదని రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్ మెంట్ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో (డిసెంబర్ వరకు) ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆందోళనకరంగా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 50,000 రిజిస్ట్రేషన్స్ తక్కువగా నమోదయ్యాయి. గత ఏడాది డిసెంబర్ నాటికి 13 లక్షల డాక్యుమెంట్లు నమోదు కాగా.. ఈసారి ఆ సంఖ్య 12.50 లక్షలకు పడిపోయింది. ఇందులో నివాస, వాణిజ్య ప్రాంతాల రిజిస్ట్రేషన్లతో పాటు వివాహ నమోదులు, మ్యుటేషన్లు కూడా ఉన్నాయి.రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి రూ. 10,500 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ. 11,100 కోట్లు సమకూరాయి. అయితే.. ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ. 19,100 కోట్ల భారీ ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడం ఇప్పుడు క్లిష్టంగా మారింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మొత్తం రూ. 14,230 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత లక్ష్యాన్ని చేరుకోవాలంటే మిగిలిన మూడు నెలల్లో సుమారు రూ. 7,800 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.. ఇది దాదాపు అసాధ్యమని అధికారులు భావిస్తున్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, సెప్టెంబర్ , నవంబర్ నెలల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు ఆశాజనకంగా సాగాయి. మిగిలిన నెలల్లో వృద్ధి మందగించిందని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ నెలను 'పేలవమైన పనితీరు' ఉన్న నెలగా అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో 1.15 లక్షల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఈ ఏడాది కేవలం 1 లక్ష మాత్రమే నమోదయ్యాయి. దీనికి భిన్నంగా జూలై 2024లో 2 లక్షల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. జూలై 2025లో అవి 1.65 లక్షలకు తగ్గిపోయాయి.ఆదాయం పెరగడానికి కారణమేంటి..? అమ్మకాలు తగ్గినా ఆదాయం పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. ప్రస్తుతం కొనుగోలుదారులు ఆధారపడుతున్నారు. ఎక్కువ లోన్ పొందడం కోసం ఆస్తి విలువను ఎక్కువగా చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మరో కారణం ఏంటంటే.. విపరీతంగా పెరగడం వల్ల.. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ విలువకే రిజిస్ట్రేషన్లు చేయాల్సి వస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో గత ఏడాది కంటే 20 శాతం అదనపు ఆదాయం వచ్చినా అది పెద్ద విజయమేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు.