తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మూసి చుట్టూ 3 కార్పొరేషన్లు..

Wait 5 sec.

హైదరాబాద్ మహానగర పాలనలో భారీ మార్పులు సంభవించబోతున్నాయి. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. . ఈక్రమంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నదిని ఆధారంగా చేసుకుని.. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.హైదరాబాద్ నగరం మధ్య నుంచి మూసీ నది ప్రవహిస్తోంది. ఈక్రమంలో నదిని ఆధారంగా చేసుకుని.. మహా నగరాన్ని మూడు భాగాలుగా విభజించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ పేర్లతో మొత్తం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ మహా నగర కార్పొరేషన్‌ డ్రైనేజ్‌ వ్యవస్థకు మూసీ నదే కీలకం. కనుక.. మూసీకి ఇరువైపుల ప్రాంతాలు వచ్చేలా.. ఈ మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నారు.ఒక్కో కార్పొరేషన్‌ పరిధిలో 5 జోన్లు, 20 సర్కిళ్లు, 100 వార్డులు ఉంటాయి. అలానే ప్రతి జోన్‌కు 4 సర్కిళ్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 3 కార్పొరేషన్లకు ముగ్గురు మేయర్లు ఉంటారు. ప్రతి కార్పొరేషన్‌కు.. ఒక కార్యదర్శి స్థాయి అధికారి.. కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి.. వచ్చే సంవత్సరం జనవరిలో.. తుది నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోకి పాతనగరంతో పాటు సెంట్రల్ హైదరాబాద్ భాగంగా ఉండనుంది. అలానే గ్రేటర్ సైబరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్ పరిధిలో.. హైదరాబాద్ పశ్చిమ, వాయవ్య ప్రాంతాలు కలుస్తాయి. గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GSMC) పరిధిలోకి ఉత్తర, ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాలు వస్తాయి.ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి చాలా విస్తారంగా ఉంది. దీంతో నగర ప్రజలకు సేవలు అందించడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న కోర్ సిటీని ఒక కార్పొరేషన్‌గా ఉంచి, శివారు ప్రాంతాలను కలుపుతూ మరో రెండు కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. దీనిలో భాగంగానే మూసీ చుట్టూ మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.