మందుబాబులకు న్యూ ఇయర్ ధమాకా.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు మద్యం అమ్మకాలు

Wait 5 sec.

డిసెంబర్ 31, న్యూ ఇయర్ కోసం.. ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచే రెడీ అయ్యాయి. మన దేశంలోని అన్ని నగరాల్లో రకరకాల ఈవెంట్లు ప్లాన్ చేశారు. పార్టీలు, పబ్‌లు, క్లబ్‌లు, డీజేలతో నగరాలన్నీ హోరెత్తనున్నాయి. అదే సమయంలో మద్యం ప్రియులు కూడా ఎంజాయ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాజధాని బెంగళూరులో అధికారులు మందుబాబులకు కిక్కి్చ్చే వార్త చెప్పారు. డిసెంబర్ 31వ తేదీన తెల్లవారుజామున 6 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇక అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ మద్యం విక్రయాలు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే ఈ మద్యం విక్రయాలు అందరూ చేసేందుకు మాత్రం అనుమతించలేదు. స్పెషల్‌గా సీఎల్-5 లైసెన్స్ ఉన్న మద్యం విక్రయదారులు మాత్రమే.. ఇలా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు అమ్ముకునే వీలు కల్పించారు. బెంగళూరు నగరవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకు, ముఖ్యంగా మహిళల భద్రత కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రూల్స్ అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఈ క్రమంలోనే కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో బెంగళూరులో మద్యం విక్రయాలు, వినియోగ సమయాన్ని పొడిగిస్తూ బెంగళూరు నగర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక ఎక్సైజ్ లైసెన్స్ (సీఎల్-5) పొందిన వారికి మాత్రమే ఈ సమయం పొడిగింపు వర్తిస్తుందని తెలిపారు. సాధారణంగా వీరికి ఉదయం 10:30 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు చేసేందుకు అనుమతి ఉంటుంది. అయితే డిసెంబర్ 31వ తేదీన మాత్రం మద్యం విక్రయ సమయం పెంచుతూ బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ అనుమతి ఇచ్చారు.సీఎల్-5 లైసెన్స్ అంటే ఏమిటి?సీఎల్-5 అంటే ఎక్సైజ్ శాఖ జారీ చేసే తాత్కాలిక లేదా ప్రత్యేక సందర్భాల లైసెన్స్. వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, రిసెప్షన్లు లేదా న్యూ ఇయర్ వంటి ప్రత్యేక కార్యక్రమాల్లో మద్యం సరఫరా చేయడానికి ఈ లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలి. ఇది కేవలం 24 గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. చెల్లుబాటు అయ్యే సీఎల్-5 లైసెన్స్ లేకుండా విందులలో మద్యం సరఫరా చేసినవారిని చట్టపరంగా శిక్షలు వేస్తారని అధికారులు స్పష్టం చేశారు.భద్రతా ఏర్పాట్లు, నిబంధనలుకొత్త సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హోటళ్లు, పబ్‌లు, బార్ యజమానులు కచ్చితంగా తెల్లవారుజామున 1 గంటలకే తమ వ్యాపార కార్యకలాపాలను ముగించాలని బెంగళూరు సీపీ ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల్లో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బెంగళూరులోని ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, ఇందిరానగర్, కోరమంగళ వంటి రద్దీ ప్రాంతాల్లో కమిషనర్ స్వయంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.