బిగ్ బాస్‌లోకి వెళ్లొచ్చిన వాళ్లని లైఫ్ బాయ్ సబ్బుని అరగతోమినట్టుగా విపరీతంగా వాడిపారేస్తుంటుంది స్టార్ మా. ఎలాగూ ముందే అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి.. వాళ్లు ఏ షో చేసినా కూడా ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లు చచ్చినట్టు వెళ్లాల్సిందే. కాబట్టి.. అలా బిగ్ బాస్ అయ్యిందో లేదో.. ఇలా ‘స్టార్ మా పరివారం‌’లోకి వచ్చేస్తుంటారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి.. మూడు నెలల్లో మీరు చూసిన ఎంటర్ టైన్మెంట్‌ని మా స్టార్ మా పరివారంలో రెండే గంటల్లో ఇవ్వబోతున్నాం గెట్ రెడీ అంటూ ఫుల్ జోష్‌లో కనిపించింది ఎనర్జిటిక్ యాంకర్ శ్రీముఖి. ఇక ఈ స్టార్ మా పరివారం తాజా ఎపిసోడ్‌‌కి సంబంధించిన ప్రోమోలో బిగ్ బాస్ సీజన్ 9 కంటస్టెంట్స్ మెరిశారు. ఇక కళ్యాణ్ అయితే కప్పు పట్టుకుని వచ్చేశాడు. అతనితో పాటు.. బిగ్ బాస్ సీజన్ 9 ప్రే(కా)మ జంట రీతూ చౌదరి, డెమాన్ పవన్‌లు బిగ్ బాస్ హౌస్‌లో రెచ్చిపోయినట్టే ఈ షోలో కూడా చెలరేగిపోయారు. కళ్యాణ్, డెమాన్, సుమన్, సంజన, భరణి, దివ్య, శ్రీజ, ఇమ్మానుయేల్, రాము రాథోడ్.. ఇలా కొంతమంది సెలెక్టెడ్ కంటెస్టెంట్స్ మాత్రమే కనిపించారు. ఇక ఇమ్మానుయేల్‌ని తెగ ఓదార్చేసింది శ్రీముఖి. మా కమెడియన్స్‌కి ఎందుకండీ కప్పు ఇవ్వరు అని పంచ్ వేశాడు అవినాష్. ఇక బిగ్ బాస్ హౌస్‌లో నా బిగ్గెస్ట్ సపోర్ట్ రీతూ అంటూ భుజంపై చేయి వేశాడు డెమాన్ పవన్. ఇక చేయి వేస్తే ఆమె ఆగుతుందా? హౌస్‌లో మాదిరే హద్దులు మీరి ప్రవర్తించింది రీతూ. నా మోస్ట్ ఇంపార్టెంట్.. మస్ట్ జెన్యూన్.. మా బుజ్జిబంగారం డెమాన్ అంటూ.. అతని బుగ్గ కొరికేసింది రీతూ చౌదరి. బిగ్ బాస్ ఆట అయిపోయినా కూడా.. వీళ్లు మాత్రం యుద్ధం ఆపడం లేదు. హౌస్‌లో ఉన్నప్పుడు కూడా ఇదే తంతు. ఆఖరికి వీళ్లది అన్ హెల్దీ రిలేషన్ షిప్ అంటూ కంటెస్టెంట్స్ అంతా రీతూ క్యారెక్టర్‌ని బజారులో అమ్మేసినా కూడా.. రీతూ మాత్రం అస్సలు తగ్గడం లేదు. డెమాన్ పవన్‌ని జుర్రడం అయితే ఆపడం లేదు. అక్కడ హౌస్‌లో అయితే కెమెరాలు ఉన్నా కూడా వీళ్లు అస్సలు తగ్గేవాళ్లు కాదు. జీడిపాకం మాదిరిగా అంటుకుని కూర్చొనే వాళ్లు. ఇప్పుడు కెమెరాల్లేవ్.. గిమేరాల్లేవ్.. పైగా హౌస్ బయట ఉన్నారు కాబట్టి.. ఈ ప్రేమ జంట ఆపేదెవరూ. రీతూ కొరికిన కొరుకుడుకి డెమాన్ పవన్ బుగ్గపై లిప్ స్టిక్ అంటుకుని పోయిందంటే.. ఎంత కసిగా ముద్దుపెట్టిందో చూడండి మరి. అయినా బిగ్ బాస్ హౌస్‌లో అలవాటు పడిన ప్రాణాలూ.. బయటకొచ్చాక ఆగుతాయా.