ఏపీలో గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు కీలక నిర్ణయం..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్ -2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. గ్రూప్ -2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్ -2 రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు మంగళవారం రోజు తీర్పు ఇచ్చింది. 2023 గ్రూప్ -2కు సంబంధించి రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు మేరకు రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని.. 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా న్యాయస్థానం అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అన్ని పిటిషన్లు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.