హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. మొబైల్ ఓపెన్ చేసి చూడగానే మొత్తం గుట్టు రట్టు..

Wait 5 sec.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వెలుగుచూసిన హనీ ట్రాప్ ఉదంతం స్థానికంగా పెద్ద కలకలం రేపింది. అమాయక వ్యక్తులను, ముఖ్యంగా ఆర్థికంగా స్థిరపడిన వారిని లక్ష్యంగా చేసుకుని మహిళలతో వల వేసి, ఆపై నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఒక ప్రమాదకరమైన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారి అయిన రౌడీ షీటర్ కోరుట్ల రాజుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్‌పల్లి పట్టణానికి చెందిన రౌడీ షీటర్ కోరుట్ల రాజ్‌కుమార్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో భర్తకు దూరంగా ఉంటున్న బలుమూరి స్వప్న అనే మహిళను భాగస్వామిని చేసుకున్నాడు. వీరిద్దరితో పాటు మరికొందరు యువకులు కలిసి ఒక గదిని అద్దెకు తీసుకుని ఈ అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపారు. ఈ ముఠా మొదట ధనవంతుల ఫోన్ నంబర్లు సేకరించేది. ఆ తర్వాత స్వప్న సదరు వ్యక్తులతో ఫోన్లో చనువుగా మాట్లాడి.. వారిని తన గదికి రప్పించేది. బాధితులు లోపలికి వెళ్లి ఏకాంతంగా ఉన్న సమయంలో, నిందితులు ఒక్కసారిగా గదిలోకి ప్రవేశించి సెల్ ఫోన్లలో నగ్న వీడియోలు చిత్రీకరించేవారు.వీడియోలు తీసిన వెంటనే నిందితులు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టేవారు. స్ట్ చేస్తామని లేదా కుటుంబ సభ్యులకు పంపిస్తామని బాధితులను తీవ్రంగా బెదిరించేవారు. మానహాని జరుగుతుందనే భయంతో చాలా మంది బాధితులు లక్షలాది రూపాయలు నిందితులకు చెల్లించినట్లు తెలుస్తోంది. తాజాగా ఒక వ్యాపారిని గదికి పిలిపించి వీడియోలు తీసిన ఈ ముఠా.. రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే ప్రాణాలు తీస్తామని హెచ్చరించింది. అయితే ఆ బాధితుడు భయపడకుండా పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా అరాచకాలు వెలుగులోకి వచ్చాయి.బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మెట్‌పల్లి ఎస్సై కిరణ్ కుమార్ , బృందం పక్కా ప్లాన్‌తో నిందితులను పట్టుకున్నారు. ప్రస్తుతం కోరుట్ల రాజ్‌కుమార్, మాగని దేవా నర్సయ్య, బలుమూరి స్వప్నలను రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న నాలుగు మొబైల్ ఫోన్లను ఓపెన్ చేసి చూడగా అందులో మరికొంత మందిని.. బ్లాక్ మెయిల్ వీడియోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గుర్తు తెలియని మహిళల నుండి వచ్చే ఫోన్ కాల్స్ , ఆహ్వానాల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.