ఇదేం తాగుడు సామీ.. న్యూ ఇయర్ వేళ ఏపీలో మందుబాబులు రికార్డ్.. ఒక్కరోజే అన్ని కోట్ల మద్యం తాగేశారా!

Wait 5 sec.

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న రాష్ట్రంలో రికార్డుస్థాయిలో జరిగాయి. ఏపీ ఎక్సైజ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబరు చివరి మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా రూ.500 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే, డిసెంబరు 31న ఒక్కరోజులో రూ.172 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని తెలిపారు. ఇందులో 2,20,719 కేసుల మద్యం, 95,026 కేసుల బీర్లు అమ్ముడయ్యాయని, గతేడాదితో పోలిస్తే రూ.60 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరిగినట్టు పేర్కొన్నారు. ఇక, 2024 డిసెంబర్ 31న రూ.112 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. 2024 డిసెంబర్ 31న 1,26,128 మద్యం కేసులు, 68,754 బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఈ డిసెంబర్ 31న మాత్రం మద్యం అమ్మకాలు ముందుసంవత్సరం కంటే గణనీయంగా పెరిగాయని ఎక్సైజ్ అధికారులు అన్నారు.. మద్యం వినియోగం, అమ్మకాలు పెరగడంతో ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు. పెరుగుతునట్లు అంచనా వేశారు. పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, మార్కెట్లలో వినియోగం సాధారణ కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. గురువారం (జనవరి 1 న) కూడా మద్యం అమ్మకాలు జోరు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.. కిందటి ఏడాది కంటే ఈ ఏడాది ఆరంభంలో కూడా మద్యం, బీర్లు అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు వివరించారు. మద్యం సరఫరా, డిమాండ్, వినియోగం, వేడుకల సీజన్ వంటి అంశాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని తెలిపారు. ముఖ్యంగా విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న రెండు రోజుల్లో ఇక్కడ రూ.11.30 కోట్లు, . డిసెంబర్ 31న ఒక్క రోజులో రూ.13 కోట్లు విలువైన మద్యాన్ని దుకాణాలు విక్రయించారు.ఇక, ఎన్నో మధుర జ్ఞాపకాలు, మరపురాని సంగతులను అందించిన 2025కు వీడ్కోలు పలికి...కోటి ఆశలతో 2026 ఏడాదిని ఆత్మీయంగా ఆహ్వానించారు. ఏపీ వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని తాకాయి.