6 బంతుల్లో 6 సిక్సులు.. SA20లో సీన్ మళ్లీ రిపీట్, ఏం కొట్టుడు కొట్టారు!

Wait 5 sec.

6 బంతుల్లో 6 సిక్సులు.. తొలి సందర్భంగా అప్పటి టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ నమోదు చేసిన ఈ ఫీట్ క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయింది. 2007 సెప్టెంబర్ ‌19న డర్బన్ వేదికగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో జరిగిన మ్యాజిక్. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో క్రీజులో ఉన్న యూవీకి.. 19వ ఓవర్ స్టువర్ట్ బ్రాడ్ వేశాడు. మొదటి బంతినే సిక్స్‌గా మలిచిన యువరాజ్.. ఆ తర్వాత ఐదు బంతుల్లోనూ సిక్స్ బాదాడు. అయితే యువరాజ్ తర్వాత ఇద్దరు ఈ ఫీట్ సాధించారు. తాజాగా మరోసారి ఈ సిక్స్ సిక్సుల ఫీట్ రిపీట్ అయింది. ముంబై ఇండియన్స్ కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ బ్యాటర్లు డేవాల్డ్ బ్రేవిస్, షేర్ఫేన్ రూథర్‌పోర్డ్ ఈ రికార్డ్ సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేశారు. ఓపెనర్ విల్ స్మీద్ (22) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ బ్రై పార్సన్స్ డకౌట్ అవడంతో ప్రిటోరియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అప్పుడు షాయి హోప్ (45) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మరో బ్యాటర్ కన్నోర్ కూడా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత విహాన్ లుబ్బే (60) రాణించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో ముంబై బౌలర్లను డెవాల్డ్ బ్రెవిస్ (36*), రూథర్‌ఫోర్డ్ (47*) కలిసి ఆడుకున్నారు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదారు. 6 బంతుల్లో 6 సిక్సులు..18వ ఓవర్లో ఐదో బంతిని డెవాల్డ్ బ్రేవిస్‌క సంధించాడు ముంబై బౌలర్ కార్బిన్ బోష్. లాండ్ టాస్ పడటంతో దాన్ని లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సుగా మలిచాడు బ్రేవిస్. ఆ తర్వాత మరో షార్ట్ లెంత్ బంతిని బాదగా.. థర్డ్ మ్యాన్ మీదుగా వెళ్లిన బంతి బౌండరీ దాటింది. దీంతో ఈ ఓవర్లో 21 పరుగులు సమర్పించుకున్నాడు కార్బిన్. ఆ తర్వాత స్ట్రైక్ రోటేట్ అయింది. ప్రిటోరియస్ వేస్తున్న 19 ఓవర్‌లో రూథర్‌ఫర్డ్ క్రీజులో ఉన్నాడు. ఈ ఓవర్‌లో మొదటి బంతినే సిక్స్‌గా మలిచాడు రూథర్‌ఫోర్డ్. అక్కడితో ఆగకుండ బౌలర్ ప్రిటోరియస్‌కు చుక్కలు చూపిస్తూ.. మరో బంతుల్లోనూ సిక్సులు బాదాడు. దీంతో వరుసగా 6 సిక్సులు బాదారు ప్రిటోరియా బ్యాటర్లు. 19వ ఓవర్‌లో ఐదో బంతికి ఒక పరుగు వచ్చింది. ఆ తర్వాత బంతి వైడ్ వెళ్లగా.. తర్వాత డాట్ బాల్ వేశాడు ప్రిటోరియస్. ఆ తర్వాత 221 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ కేప్‌టౌన్.. 14.2 ఓవర్లలో135 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు రస్సీ వాన్ డస్సెన్ (28), రియాన్ రికల్టన్ (33), నికోలస్ పూరన్ (25) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాటర్లందరూ తేలిపోయారు. దీంతో 85 పరుగుల తేడాతో ప్రిటోరియా క్యాపిటల్స్ విజయం సాధించింది.