జనవరి 2026 డీఏ పెంపుపై బిగ్ అప్డేట్.. ఈసారి ఎంత పెరగనుంది.. అంచనాలు ఇవే

Wait 5 sec.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు ఇచ్చే డియర్‌నెస్ రిలీఫ్ అర్ధ వార్షిక సమీక్షకు సమయం వచ్చేసింది. ప్రతి సంవత్సరం జనవరి, జులైలో డీఏ పెంపు సమీక్ష ఉంటుంది. ఇప్పుడు కొత్త ఏడాది 2026 జనవరి నెలలోకి వచ్చిన క్రమంలో ఈసారి డీఏ పెంపు ఎంత ఉండనున్నదన్న అంచనాలు వస్తున్నాయి. ముఖ్యంగా 7వ వేతన సంఘం ముగిసి 8వ వేతన సంఘంలోకి వచ్చిన క్రమంలో తొలి డీఏ పెంపుపై ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. మరి ఆ అంచనాలు ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే నవంబర్ 2025కి సంబంధించిన ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రీయల్ వర్కర్స్ (AICPI-IW) డేటా వచ్చేసింది. దీంతో లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఇందుకు సంబంధించి జాతీయ మీడియా సంస్థలు సైతం కథనాలు ప్రచురిస్తున్నాయి. అయితే, డిసెంబర్ నెలకు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీ డేటా వచ్చిన తర్వాతే డీఏ, డీఆర్ పెంపుపై పూర్తి స్పష్టత రానుంది. అయితే నవంబర్ నెలకు సంబంధించిన డేటా ప్రకారం ఈసారి డీఏ 58 శాతం నుంచి భారీగానే పెరగనుందని తెలుస్తోంది. కొత్త ఏడాదిలోకి వచ్చేసిన క్రమంలో ఈసారి డీఏ పెంపు 2 శాతం ఉంటుందా లేదా 3 శాతం ఉంటుందా అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. అయితే డీఏ పెంపునకు ఓ నిర్దిష్ట ఫార్ములా ఉంది. అలాగే సిఫారసులపై ఈ డీఏ పెంపు ఏదైనా ప్రభావం చూపనుందా అనే విషయంపైనా చర్చ కొనసాగుతోంది. జులై 2025లో డీఏ, డీఆర్ 3 శాతం మేర పెంచారు. దీంతో డీఏ, డీఆర్ 58 శాతానికి చేరింది. డీఏ లెక్కింపు ఫార్ములాDA% = [{12 నెలల సగటు ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ (బేస్ ఇయర్ 2001)- 261.42}/261.42*100] కార్మిక శాఖ గణాంకాల ప్రకారం గత 12 నెలల ఇన్‌ఫ్లేషన్ డేటా సగటున 145.17గా ఉంది. అంటే కాలిక్యులేటర్ ప్రకారం DA% = [{(145.17*2.88)- 261.42}/ 261.42*100] = 418.06-261.42/261.41*100 = 0.5999*100 = 59.93 శాతం. అయితే ప్రభుత్వం డెసిమల్ నంబర్లను రౌండ్ ఫిగర్ చేస్తారు. దీని ప్రకారం డీఏ 60 శాతానికి చేరనుంది. కానీ, డిసెంబర్ నెల డేటా వస్తే లెక్క క్లారిటీగా ఉండనుంది. అయినప్పటికీ డీఏ పెంపు కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 2 శాతంగా ఈ డీఏ, డీఆర్ పెంపు ఉంటుందని నవంబర్ లెక్కలతో తెలుస్తోంది. ఇక డిసెంబర్ లోనూ సీపీఐ డేటా అధికంగా ఉంటే డీఏ మరింత పెరగవచ్చు. ఎంతైనా 3 శాతానికి మించకపోవచ్చన్న అంచనాలూ ఉన్నాయి.