కాబోయే భార్య ఫొటోని షేర్ చేస్తూ.. ఇమ్మానుయేల్ ఎమోషనల్ పోస్ట్.. డాక్టర్ పాప సిగ్గు చూశారా

Wait 5 sec.

బిగ్ బాస్ ప్రతి సీజన్‌కి జనాల్ని మెప్పించిన పీపుల్ విన్నర్ ఒకరైతే.. బిగ్ బాస్ విన్నర్ మరొకరు అవుతారు. గత సీజన్లను పక్కన పెడితే.. ఈ సీజన్‌లో మాత్రం పీపుల్ విన్నర్, రియల్ విన్నర్, ఆటగాడు, పోటుగాడు, ఎంటర్ టైనర్ ఆఫ్ ది హౌస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్ రౌండర్ అంటే ఇమ్మానుయేల్ ఒక్కడే. కళ్యాణ్ పడాల విన్నర్ అయినా.. తనూజ రన్నర్ అయినా కూడా.. వాళ్లిద్దరి కంటే కూడా బాగా ఆడింది మాత్రం ఇమ్మానుయేల్. ఇంకా చెప్పాలంటే.. కళ్యాణ్ లేకపోయినా, తనూజ లేకపోయినా అంతెందుకు మూడో స్థానంలో నిలిచిన డెమాన్ పవన్ లేకపోయినా.. చివరికి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున లేకపోయినా ఊడేదీ లేదూ.. పీకేదీ లేదు కానీ.. ఇమ్మానుయేల్ లేకపోతే అసలు సీజన్ 9 అనేదే లేదు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఇమ్మానుయేల్. హౌస్‌లోకి అడుగుపెట్టింది మొదలు.. 105వరోజున ఆ హౌస్‌లో లైట్లు ఆర్పే వరకూ కూడా ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు ఇమ్మానుయేల్. అలాంటి విన్నర్ మెటీరియల్‌ని అత్యంత దారుణంగా నాలుగో స్థానంలో ఎలిమినేట్ చేసి అవమానకరంగా హౌస్ నుంచి బయటకు పంపించారు.అయితే బిగ్ బాస్ ట్రోఫీ గెలవకపోయినా జనం హృదయాలను గెలుచుకున్నాడు ఇమ్మానుయేల్. జనం హృదయాలతో పాటు.. ఓ డాక్టర్ పాప హృదయాన్ని కూడా కొల్లగొట్టాడు ఇమ్మానుయేల్. హౌస్‌లో ఉన్నప్పుడు ఆమె కోసమే పరితపించి పోయిన ఇమ్మానుయేల్.. తొలిసారిగా ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. హైదరాబాద్‌లో AAA (అల్లు అర్జున్) మాల్‌లో తన ప్రేయసితో కలిసి ఫొటో దిగి.. దాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కాబోయే భార్య గురించి భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు ఇమ్మూ. అయితే ఈ ఫొటోలో ఇమ్మూకి కాబోయే భార్య (రుచి) ముఖం కనిపించకుండా సిగ్గుతో దాచేసుకుంది. ఆమె డాక్టర్ చదువుతుండటం విశేషం కాగా.. ఆమె ముద్దుగా వేస్టూ అని పిలుస్తాడు ఇమ్మానుయేల్. ఆమె పై చదువుల కోసం యూఎస్ వెళ్లాల్సి ఉండగా.. కేవలం ఇమ్మానుయేల్ కోసం ఇక్కడే ఉండిపోయింది ఈ డాక్టర్ పాప. తన కోసం తన కెరియర్‌ని త్యాగం చేసిన కాబోయే భార్య గురించి ఇమ్మానుయేల్ ఏమన్నాడంటే.. ‘‘థాంక్యూ వేస్ట్ అమ్మ (రుచి). నా లైఫ్‌లోకి వచ్చినందుకు. నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు. నాకు తెలుసు నేను నిన్ను చాలా హర్ట్ చేశాను. కానీ ఈ కొత్త ఏడాది నుంచి మనం ఇంకా స్ట్రాంగ్‌గా ఉండి.. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. ఇప్పటి నుండి నిన్ను ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నా. నేను అడగకుండానే దేవుడు నాకు ఇచ్చిన అతిపెద్ద బాహుమతి నువ్వు. నిన్ను ఎవరూ రీ ప్లేస్ చేయలేరు. నా లైఫ్‌లో ఎంతో సపోర్ట్ చేస్తున్న నా సపోర్టింగ్ సిస్టమ్ నువ్వు.. థాంక్యూ సోమచ్. నీ అన్ కండిషనల్ లవ్‌ అండ్ సపోర్ట్‌కి థాంక్యూ సో మచ్ బుజ్జి ఫెలో. లవ్యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ వేస్ట్ అమ్మా. నా ప్రపంచం నువ్వే’ అంటూ కొత్త ఏడాదిలో కాబోయే భార్యతో ఉన్న ఫొటోని షేర్ చేస్తూ.. ఆమెపై ఉన్న ఎనలేని ప్రేమని ఈ పోస్ట్‌ ద్వారా షేర్ చేశారు ఇమ్మానుయేల్.