ఎల్ఐసీ‌లో 7.15 శాతం వడ్డీకే హోం లోన్.. రూ. 20 లక్షలపై 15 ఏళ్లకు నెలకు ఈఎంఐ ఎంతంటే?

Wait 5 sec.

: రిటైల్ ద్రవ్యోల్బణం దిగొస్తున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రెపో రేట్లను 2025 ఏడాదిలో ఏకంగా 4 సార్లు తగ్గించింది. 3 సార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున.. మరోసారి 50 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ఏడాదిలోనే ఏకంగా 125 బేసిస్ పాయింట్లు లేదా 1.25 శాతం రెపో రేటును తగ్గించింది. ఈ క్రమంలోనే ఏడాది ఆరంభంలో 6.50 శాతంగా ఉన్న వడ్డీ రేటు.. ఇప్పుడు 5.25 శాతానికి చేరింది. ఆర్బీఐ రెపో రేట్లను తగ్గించగా.. బ్యాంకులు కూడా చాలా వరకు లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇందులో ఎక్కువగా రెపో రేటుకు లింక్ అయి ఉన్న హోం లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా ఇతర బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కూడా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. >> ప్రముఖ ఆర్థికేతర కంపెనీ అయిన భారీగా తగ్గించింది. ఇది హోం లోన్లు తీసుకునే వారికి భారీ ఉపశమనం అందించింది. కనీసం ఇప్పుడు ఇందులో 7.15 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాల్ని ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది చాలా వరకు తక్కువ వడ్డీ రేటు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సిబిల్ స్కోరు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మెరుగైన సిబిల్ స్కోరు ఉన్న వారికి తక్కువ వడ్డీ రేటుకే హోం లోన్ వస్తుంది. 825 ఆపైన సిబిల్ ఉన్న వారికి రూ. 5 కోట్ల వరకు హోం లోన్ వడ్డీ రేటు 7.15 శాతంగానే ఉంది. రూ. 5-15 కోట్ల మధ్య ఉంటే వడ్డీ రేటు ఇక్కడ 7.45 శాతంగా ఉంది. సిబిల్ 800-824 గా ఉంటే రూ. 5 కోట్ల వరకు హోం లోన్‌పై వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది. సిబిల్ 775-799 మధ్య ఉంటే 50 లక్షల వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు 7.35 శాతం, రూ. 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు హోం లోన్ వడ్డీ రేటు 7.45 శాతంగా, రూ. 2 కోట్లకుపైగా హోం లోన్ వడ్డీ రేటు 7.65 శాతంగా ఉంది. ఇక్కడ మనం ఏయే వడ్డీ రేట్లపై రూ. 20 లక్షల లోన్‌ను.. 15 ఏళ్ల కాల పరిమితితో తీసుకుంటే ఈఎంఐ ఎంత పడుతుందో చూద్దాం. 7.15 శాతం వడ్డీ రేటుకు చూస్తే 15 ఏళ్లకు నెలకు ఈఎంఐ రూ. 18,145 గా ఉంది. మొత్తం వడ్డీ రూపంలో రూ. 12,66,047 చెల్లించాల్సి వస్తుంది. 7.25 శాతం వడ్డీ రేటుకు అయితే నెలకు ఈఎంఐ రూ. 18,257 పడుతుంది. 7.35 శాతం వడ్డీ రేటుకు నెలకు ఈఎంఐ రూ. 18,370 గా ఉంది. 7.45 శాతం వడ్డీ రేటుకు ఈఎంఐ రూ. 18,483 కాగా.. 7.65 శాతం వడ్డీ రేటుకు ఈఎంఐ రూ. 18,711 గా ఉంది. ఇక్కడ వడ్డీ రేటు పెరుగుతుంటే.. ఈఎంఐ పెరుగుతుంది.