ఆ టాక్స్‌పేయర్లకు శుభవార్త.. ఐటీ రిటర్న్స్ గడువు మరోసారి పొడిగింపు.. కొత్త డెడ్‌లైన్ ఇదే..

Wait 5 sec.

: భారతదేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీని కింద నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటిన వారు.. ఇన్‌కం టాక్స్ యాక్ట్‌లోని పన్ను శ్లాబుల్ని బట్టి పాత లేదా కొత్త పన్ను విధానాల్లో టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం లేదా అసెస్‌మెంట్ ఇయర్‌లో ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు, ఆడిట్ అవసరం లేని వారికి ఈ గడువు 2025, సెప్టెంబర్ 16తోనే ముగిసింది. ఇదే సమయంలో కంపెనీలు కూడా తమ , ఫైనాన్షియల్ రిపోర్ట్స్ (ఆర్థిక నివేదికలు) సమర్పించేందుకు గడువు ఉంటుంది. అయితే తాజాగా.. దీనిపైనా కేంద్రం కీలక ప్రకటన చేసింది. >> కంపెనీల లా చట్టం కింద.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీల ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్నుల్ని సమర్పించేందుకు గడువును మరోసారి పొడిగిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మంగళవారం రోజు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు కంపెనీలు రిటర్న్స్ ఫైల్ చేసేందుకు గడువు 2025, డిసెంబర్ 31 గానే ఉండేది. అప్పటికే ఒకసారి పొడిగించగా.. ఇప్పుడు దీనిని మరో నెల పెంచి.. జనవరి 31 కి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫైలింగ్ వ్యవస్థలో కొద్ది రోజులుగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో చాలా మంది ఈ గడువును పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పలు వర్గాల నుంచి విజ్ఞప్తులు అందిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కంపెనీలు ఎలాంటి అదనపు రుసుములు లేకుండానే రిటర్న్స్ జనవరి 31 వరకు ఫైల్ చేసేందుకు అనుమతి ఉందన్నమాట. కేవలం ఫైలింగ్స్‌కు మాత్రమే ఈ గడువు ఉంటుంది. అంతేగానీ.. వార్షిక సాధారణ సమావేశాలు (AGM) నిర్వహించే గడువు తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని గుర్తుంచుకోవాలి. మరిన్ని వివరాలకు, ఫైలింగ్ చేయడానికి.. MCA (మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్) అధికారిక పోర్టల్ సందర్శించవచ్చు.కంపెనీలు తమ వార్షిక రిటర్న్స్ సమర్పించేందుకు MGT7, MGT-7A, AOC-4, AOC-4 CFS, AOC-4 NBFC (Ind AS), AOC-4 CFS NBFC (Ind AS), AOC (XBRL) వంటి ఫారాలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీల చట్టం- 2013 ప్రకారం.. ప్రతి కంపెనీ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తమ వార్షిక రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇందులో బ్యాలెన్స్ షీట్, లాభ నష్టాల ఖాతా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వంటివి ఉంటాయి.