ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి నెలకు రూ.12వేలు ఇస్తారు, న్యూ ఇయర్ కానుక

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి స్టైఫండ్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. తాజాగా జీవోను విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.4500 స్టైఫండ్‌ను రూ.12000కు పెంచింది. అంటే ఒక్కసారిగా రూ.7,500 జీతం పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో చివరిసారిగా శిక్షణ కానిస్టేబుళ్లకు స్టైఫండ్ పెంచారు. గత 13 ఏళ్లుగా మార్పు లేదు.. ఇప్పుడు మళ్లీ పెంచారు. ఈ మేరకు హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేశారు. ఈ నిర్ణయం డిసెంబర్ 16న మంగళగిరిలో జరిగిన పత్రాల పంపిణీ కార్యక్రమంలో స్టైఫండ్‌ పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6 బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత పాల్గొన్నారు. వీరంతా కలిసి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగానే ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించారు. గతంలో ట్రైనీ కానిస్టేబుళ్లకునెలకు రూ.4500 రూపాయల స్టైఫండ్ అందేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.12000 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన స్టైఫండ్ వెంటనే అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం కానిస్టేబుళ్ల శిక్షణ కాలంలో వారికి ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుంది.ఈ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత శుభాకాంక్షలు తెలిపారు. వారు రాష్ట్ర భద్రతలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్‌ను పెంచుతున్నట్లు హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు.. తాజాగా హోంశాఖ జీవో నెంబర్ 183ను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా జారీ చేసింది. పెరిగిన జీవన వ్యయం, అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పెంపు చేపట్టినట్లు చెబుతున్నారు.6100 మంది రిక్రూట్మెంట్‌ కోసం నోటిఫికేషన్‌ ఇస్తే అందులో 6014 మంది సెలక్ట్‌ అయ్యారు. ఇందులో 5757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక అయ్యారు. వీరిలో సివిల్‌ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్‌లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. గత నెలలో.. మంగళగిరి ఏపీఎస్పీ 6 బెటాలియన్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం జరిగిన కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, హోం మంత్రి అనితతో కలిసి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.