చంద్రబాబు ప్లాన్ వర్కవుట్.. దేశంలోనే పావు శాతం ఏపీకే.. ఆ విషయంలో నంబర్ వన్..

Wait 5 sec.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఆకర్షించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. దీంతో రాష్ట్రంలో కంపెనీల స్థాపనకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఫోర్బ్స్ ఇండియా కీలక వివరాలు వెల్లడించింది. ఏపీ ఐటీ శాఖ ఈ వివరాలను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేశారు. ప్రకారం.. దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు వస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకూ 9 నెలలు పూర్తయ్యాయి. మూడు క్వార్టర్లు పూర్తి కాగా.. మరో క్వార్టర్ మిగిలి ఉంది. అయితే ఈ 9 నెలల కాలంలో దేశంలోనే ఎక్కువ ప్రతిపాదిత పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిపాదిత పెట్టుబడులలో సుమారుగా పావుశాతం వాటా ఏపీ సొంతం చేసుకుంది. 25.3 శాతం వాటాతో ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. 13.1 శాతం వాటాతో ఒడిశా రెండో స్థానంలో నిలవగా.. 12.8 శాతంతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది. 9.5 శాతంతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 7.1 శాతంతో గుజరాత్, 4.9 శాతంతో తమిళనాడు ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. కర్ణాటక 2.1 శాతం, అస్సాం 0.9 శాతం, ఝార్ఖండ్ 0.9 శాతంతో ఆఖరి స్థానంలో ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిపాదిత పెట్టుబడులలో సగానికి పైగా (51.2 శాతం) ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలకే రావటం గమనార్హం. అలాగే గత ఆర్థిక సంవత్సరం ఇదే 9 నెలలతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో 11.5 శాతం అదనంగా పెట్టుబడులు వచ్చినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేర్కొంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్టును ఉటంకిస్తూ ఫోర్బ్స్ ఇండియా చేసిన ట్వీట్‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ రీట్వీట్ చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇలాగే ఉంటుందంటూ ట్వీట్ చేశారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులను సాధించడానికి ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు అనేక రాయితీలు అందిస్తోంది. అలాగే విశాఖపట్నం వేదికగా ఇటీవల సీఐఐ భాగస్వామ్య సదస్సు కూడా నిర్వహించింది. ఈ సదస్సులో ఒప్పందాలు చేసుకుంది. ఈ ప్రతిపాదిత పెట్టుబడులన్నీ సాకారమైతే.. ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుదిరిన ఒప్పందాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.