కనీసం 90 రోజులు పని చేయాల్సిందే.. గిగ్ వర్కర్లకు PF, బీమా రూల్స్‌పై కేంద్రం ముసాయిదా

Wait 5 sec.

: ఆన్‌లైన్ ఫుడ్, నిత్యావసర సరుకుల వంటివి డెలివరీ చేసే గిగ్ వర్కర్లకు బిగ్ అలర్ట్. మెరుగైన వేతనాలు, సామాజిక ద్రత వంటి డిమాండ్లు సాధించుకునేందుకు నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గిగ్ వర్కర్లకు సంబంధించిన సామాజిక భద్రతా నిబంధనలు మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గిగ్ వర్కర్లు సామాజిక భద్రత ప్రయోజనాలు పొందాలంటే వారు పాటించాల్సిన నిబంధనలు, విధివిధానాలపై ముసాయిదా విడుదల చేసింది. మరి ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గిగ్ వర్కర్లు సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందేందుకు అర్హత సాధించాలంటే ఇకపై వారు కనీసం 90 రోజులు పని చేసి ఉండాలి. అంటే ఒక అగ్రి గేటర్ వద్ద కనీసం 90 రోజులు గిగ్ వర్కర్లు పని చేసి ఉండాలి. అలాగే ఒకటి కంటే ఎక్కువ అగ్రి గేటర్ల వద్ద పని చేసినట్లయితే కనీసం 120 రోజుల పని దినాలు పూర్తి చేసి ఉండాలని ముసాయిదా నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. కనీస అర్హత ప్రమాణాలపై ముసాయిదాలో పేర్కొంది. ఈ ముసాయిదా నిబంధనలపై సందేహాలు, సలహాలు, సూచనలు తెలియజేయాలని గిగ్ వర్కర్లను కోరింది. కేంద్ర ప్రభుత్వం నెలన్నర క్రితమే కొత్త లేబర్ కోడ్స్ నోటిఫై చేసింది. ఇందులో గిగ్ వర్కర్లకు సంబంధించి సైతం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. కొత్త లేబర్ కోడ్స్‌ గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తాయని కేంద్రం తెలిపింది. వారిని అధికారింగా గుర్తిస్తాయి. అగ్రిగేటర్ల నుంచి సామాజిక భద్రతా నిధిని ఏర్పాటు చేస్తాయని పేర్కొంది. దీంతో గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాలు అందుతాయి. అయితే, ఈ సామాజిక భద్రత పొందడానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 90 నుంచి 120 రోజుల పని దినాలు అవసరం. అగ్రిగేటర్ తమ టర్నోవర్‌లో 1- 2 శాతం సామాజిక భద్రతా నిధికి చెల్లించాలనే నిబంధన పెట్టారు. దీనిని గిగ్ వర్కర్లకు ప్రయోజనాలు అందించేందుకు ఉపయోగించాల్సి ఉంటుంది. పని గంటల విషయానికి వస్తే రోజుకు 8- 12 గంటలు, వారానికి 48 గంటల వరకు ఉండవచ్చు. వేతనాల కోడ్‌లో బేసిక్ పే 50 శాతానికి మించకుండా ఉండాలి. మిగితా అలవెన్సులు 50 శాతంగా ఉండాలి.