: ప్రభుత్వ రంగానికి అతిపెద్ద జీవిత బీమా కంపెనీ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC). ఇది కేవలం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందించడం మాత్రమే కాకుండా.. పెట్టుబడులు, టర్మ్ ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి ఇతర ఆర్థిక సేవల్ని ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. ఇన్సూరెన్స్ పథకాల్లో సేవింగ్స్ ప్లాన్స్ కూడా అందిస్తుంటుంది. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్ని కూడా ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త కొత్త ప్లాన్స్ కూడా లాంఛ్ చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నియంత్రణలో పనిచేస్తుంది. 2025లో కూడా ఎల్ఐసీ.. తన కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎన్నో కొత్త ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ లాంఛ్ చేసింది. ఇందులో కొన్ని గ్యారెంటీ రిటర్న్స్ అందించేవి ఉన్నాయి. కొన్ని మహిళకు ఆర్థిక భద్రత అందిస్తూ ఇతర ప్రయోజనాల్ని అందిస్తోంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించే ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ పథకాల గురించి ఇప్పుడు చూద్దాం. ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్- ప్లాన్ 886: ఇది . ఇక్కడ పాలసీ టర్మ్‌లో జీవిత బీమా కవరేజీ సహా సేవింగ్స్ కూడా అందిస్తుంది. నాన్ పార్టిసిపేటింగ్ స్కీమ్ కాబట్టి ఇక్కడ గ్యారెంటీ రిటర్న్స్ ఏం ఉండవు. ఇంకా బోనస్ వంటివి రావు. ఇక్కడ ఏ రకం ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, హామీ మొత్తం (సమ్ అష్యుర్డ్) పెంచుకోవడం, తగ్గించుకోవడం, టాప్ అప్ ప్రీమియంలు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ పాలసీదారుడికి వారి పెట్టుబడి, రాబడి ఎంత కావాలో ఎంచుకోవచ్చు. ఎల్ఐసీ బీమా కవచ్- ప్లాన్ 887: ఇది కూడా నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, ఇండివిడ్యువల్ ప్యూర్ రిస్క్ లైఫ్ ప్లాన్. . పాలసీ కాలంలో అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఇక్కడ డెత్ బెనిఫిట్స్ స్థిరంగా, కచ్చితత్వంతో ఉంటాయి. ఎల్ఐసీ జన్ సురక్షణ్- ప్లాన్ 880: ఇది లైఫ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఆర్థిక భద్రత అందించడం దీని ఉద్దేశ్యం. ఇక్కడ ఆటో కవర్ ఫెసిలిటీ, గ్యారెంటీ అడిషన్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ పాలసీ సమయంలో అనుకోనిది ఏమైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక రక్ష అందుతుంది. జీవించి ఉన్నట్లయితే ఏక మొత్తంలో నగదు అందుతుంది. ఎల్ఐసీ బీమా లక్ష్మీ- ప్లాన్ 881: . ఇక్కడ ప్రతి 2 లేదా 4 సంవత్సరాలకు ఒకసారి నిర్ణీత మొత్తాన్ని పాలసీదారులు పొందొచ్చు. ఇది మనీ బ్యాక్ ప్లాన్ అని చెప్పొచ్చు. 3 ఏళ్లు పూర్తి ప్రీమియం చెల్లిస్తే.. ఆటో కవర్ ఫెసిలిటీ వర్తిస్తుంది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్- 879: . ఇది కూడా నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, గ్రూప్, సేవింగ్స్, ఇమిడియేట్ యాన్యుటీ ప్లాన్. ఇక్కడ ఒకేసారి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే.. వెంటనే పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. కనీసం 18 ఏళ్ల నుంచి వందేళ్ల వరకు ఇందులో చేరొచ్చు. కనీసం రూ. 1 లక్ష పెట్టుబడితో ప్రారంభించొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. మీకు మాత్రమే పెన్షన్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. అదే సమయంలో జీవిత భాగస్వామిని కూడా చేర్చుకోవచ్చు.