: ఎలాంటి రిస్క్ లేకుండా నిర్దిష్ట కాల పరిమితికి.. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం స్థిరమైన రాబడి అందించే వాటిల్లో చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మంచి గిరాకీ ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ కనీస మొత్తం నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉంటుంది. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ ఉంటుంది. దీర్ఘకాలంలో అధిక రాబడి అందుకోవచ్చు. ఇంకా టాక్స్ బెనిఫిట్స్ కూడా అందుకోవచ్చు. ఇలా వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. సామాన్యుల నుంచి మొదలుకొని.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు.. వృద్ధులు ఇలా అంతా తమ పొదుపుల్ని పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ దాదాపు అన్ని వర్గాల వారి కోసం పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాల్లో వడ్డీ రేట్లు, కాల పరిమితులు, అర్హతలు ఒక్కో దాంట్లో ఒక్కోలా ఉంటాయని చెప్పొచ్చు. వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం.. ప్రతి త్రైమాసికంలో సవరిస్తుంటుంది. ఇక్కడ ఎన్నో అంశాల ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ఇక్కడ వడ్డీ రేట్లను పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు లేదా స్థిరంగానే ఉంచొచ్చు. చాలా కాలంగా వడ్డీ రేట్లను పెద్దగా మార్చట్లేదు. అయితే ఈసారి ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత ఈ ఉన్నట్లు తెలుస్తోంది. 2026 జనవరి- మార్చి త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇవాళ (డిసెంబర్ 31) ప్రకటించనుంది. ఈ క్రమంలో వడ్డీ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నారు. ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం, ఆర్బీఐ కీలక రెపో రేట్లను తగ్గిస్తుండటం సహా పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల రాబడి కూడా తగ్గింది. వీటి ఆధారంగానే ఆయా పథకాల వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది కేంద్రం. .. వడ్డీ రేటు ప్రస్తుతం 7.10 శాతంగా ఉంది. ఇక్కడ చాలా కాలంగా వడ్డీ రేటును పెంచాలన్న డిమాండ్లు వినిపించినా కేంద్రం స్థిరంగానే ఉంచుతూ వచ్చింది. ఇక్కడ పెట్టుబడి, వడ్డీ రాబడి, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై టాక్స్ పడదు. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కారణంగా దీర్ఘకాలంలో మంచి రాబడి అందిస్తుంది. 2020, ఏప్రిల్ 1 నుంచి ఈ స్థిరంగానే ఉన్నాయి. మరి ఇప్పుడు వడ్డీ రేట్లను తగ్గిస్తుందా.. లేదా ఇన్వెస్టర్ల ప్రయోజనాల్ని దెబ్బతీయకుండా ఉండేందుకు ప్రభుత్వం భారాన్ని మోస్తూ.. స్థిరంగానే ఉంచుతుందా అన్నది చూడాలి. ఇప్పుడు పీపీఎఫ్ వడ్డీ రేట్లను కేంద్రం తగ్గిస్తే గనుక.. ఏకంగా 49 ఏళ్ల కనిష్ఠానికి చేరనున్నాయి. చివరిగా 1974-75, 1976-77 లో వడ్డీ రేట్లు 7 శాతంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ స్థాయికి చేరనున్నాయి. 1968-69 లో వడ్డీ రేటు 4.8 శాతంగానే ప్రారంభించినా.. 1986-87, 1998-99, 1999-2000 మధ్య వడ్డీ రేట్లను ఏకంగా 12 శాతం అందించింది. అక్కడి నుంచి మాత్రం వరుసగా తగ్గుతూ వచ్చాయి.