ఏపీ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి.. జస్ట్ ఆ బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో విధి నిర్వహణలో మరణించిన ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుల్‌కు రూ.కోటి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు కుటుంబానికిరూ.కోటి ప్రమాద బీమా పరిహారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌బీఐ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఈ పరిహారం మంజూరైంది. అమరావతిలోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కును పిచ్చేశ్వరరావు భార్య వెంకటదుర్గకు ఈ చెక్కును అందజేశారు. అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తామని.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా, కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పిచ్చేశ్వరరావు కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ సహాయం అందిస్తోంది. ఎస్‌బీఐ బీమా పథకం కింద ఈ పరిహారం మంజూరు చేశారు. ఈ పరిహారం కుటుంబానికి కొంత ఆర్థిక భరోసాను అందిస్తుంది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ' (SGSP) పథకం కింద హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించింది. ఎక్సైజ్ శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు జూలైలో ప్రమాదవశాత్తు మరణించగా, ఆయన కుటుంబానికి రూ.1 కోటి బీమా పరిహారం అందింది. ప్రభుత్వ ఉద్యోగులకు SBIలో జీతాల ఖాతాలు ఉంటే.. వారికి బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఈ SGSP పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కోసం ఉద్యోగులు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత, విధి నిర్వహణలో మరణించిన పిచ్చేశ్వరరావుకు ఈ బీమా పరిహారం అందడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.‘ఆయుష్‌’లో 140 పోస్టుల భర్తీరాష్ట్ర ప్రభుత్వం ఆయుష్‌ శాఖలో దశాబ్దాలుగా ఉన్న ఖాళీల సమస్యకు పరిష్కారం చూపింది. నాలుగు హోమియో, ఆయుర్వేద వైద్య కళాశాలల్లో 140 బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను ఒకేసారి భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా అన్ని ఖాళీలను ఒకేసారి భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి అని ఆ శాఖ ఉద్యోగులు తెలిపారు. ఈ నిర్ణయంతో ఆయుష్‌ శాఖలో దశాబ్దాలుగా వేధిస్తున్న సిబ్బంది కొరత తీరనుంది. రాష్ట్రంలోని నాలుగు హోమియోపతి, ఆయుర్వేద వైద్య కళాశాలల్లో మొత్తం 140 బోధన, బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలన్నింటినీ ఒకేసారి భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఇలా అన్ని ఖాళీలను ఒకేసారి భర్తీ చేయడానికి అనుమతి లభించలేదని ఆయుష్‌ శాఖ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యతో వైద్య విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుందని, కళాశాలల్లో పరిపాలన కూడా సులభతరం అవుతుందని భావిస్తున్నారు.