ఏపీలో వారందరికి షాక్.. రూ.75వేలు వెనక్కి ఇచ్చేయండి, నోటీసులు జారీ

Wait 5 sec.

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బీసీలకు రూ.50 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.75 వేల చొప్పున అదనపు ఆర్థిక సాయాన్ని మార్చిలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. అయితే చాలామంది లబ్ధిదారులు ఈ డబ్బుతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. కానీ, కొందరు మాత్రం పనులు ప్రారంభించలేదు. ఇలా పనులు మొదలుపెట్టని వారి ఖాతాల్లో జమ చేసిన డబ్బును వెనక్కి తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి, పనులు ప్రారంభించని వారికి నోటీసులు జారీ చేసి, నగదును ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని సూచిస్తున్నారు.ఈ అదనపు సాయం ద్వారా చాలామంది తమ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్నారు. అయితే, కొందరు లబ్ధిదారులు మాత్రం ఇంకా పనులు మొదలుపెట్టలేదు. అధికారులు వారిని సంప్రదించినా, పనులు వేగవంతం చేయడంలో ప్రయోజనం కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన నగదును వెనక్కి తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాల అమలుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. పనులు ప్రారంభించని వారికి నోటీసులు జారీ చేసి, ఖాతాల్లో జమ చేసిన నగదును ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని స్పష్టంగా చెబుతున్నారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.ప్రభుత్వం ఇచ్చిన అదనపు సాయంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లబ్ధిదారులకు గృహ నిర్మాణ సంస్థ అధికారులు సూచించారు. డిసెంబర్ 31 లోపు నిర్మాణాలు పూర్తి చేయకపోతే, ఇచ్చిన డబ్బును తిరిగి తీసుకుంటాము అన్నారు. క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ, పనులు ప్రారంభించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు పనులు ప్రారంభించని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తున్నామని వారు పేర్కొన్నారు. లేదంటే ఇంటి కోసం ఇచ్చిన సొమ్మును రికవరీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.