మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్

Wait 5 sec.

రాష్ట్ర మంత్రిగా మహమ్మద్‌ అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. నేడు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ.. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాలులో అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీనికి సంబంధించి అధికారులు గురువారం నాడే అన్ని ఏర్పాట్లు చేశారు. రాజ్ భవన్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్, తదితర అంశాలపై అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు.మాజీ ఎంపీ అజారుద్దీన్ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేశారు.అయితే ఈ ఉప ఎన్నికలో కూడా ఆయనే జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ చివరకు గవర్నర్ కోటా ద్వారా ఆయనని ఎమ్ఎల్‌సీ చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా శుక్రవారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్ కు కేటాయించే శాఖల పైన రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కొందరి మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఖాయంగా కనిపిస్తోంది.అజారుద్దీన్ ఎట్టకేలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఓడిపోయిన అజారుద్దీన్ కు..ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక వేళ మంత్రిగా అవకాశం దక్కింది. రాష్ట్ర మంత్రి వర్గంలో ముస్లిం మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం లేదు. జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓటింగ్ గెలుపు ఓటములను డిసైడ్ చేయటంలో కీలక భూమిక పోషించనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో సీటు ఆశించిన అజారుద్దీన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫారసు చేసారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఖరారు అయిన తరువాత అనేక రకాల చర్చలు తెర మీదకు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఒక వర్గం ఓట్ల కోసమే అజారుద్దీన్ ను మంత్రి చేస్తున్నారంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కానీ చివరకు ఎలాంటి అవాంతరం లేకుండా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో అజారుద్దీన్‌ జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. నిజాం కాలేజీలో బీకాం చదివారు. మేనమామ జైనులాబుద్దీన్‌ స్ఫూర్తితో క్రికెట్‌ వైపు అడుగులు వేశారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్‌లో రంగప్రవేశం చేశారు. అజారుద్దీన్‌ క్రికెటర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో సంచలనం సృష్టించారు.1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా భాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. రిటైర్మెంట్‌ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్‌పార్టీలో చేరారు. అదే సంవత్సరం యూపీలోని మొరాదా