టాక్స్ రిఫండ్ కోసం చూస్తుంటే.. ఐటీ నోటీసు వచ్చిందా.. ఇప్పుడేం చేయాలో తెలుసా?

Wait 5 sec.

: మన దేశంలో నిర్దిష్ట ఆదాయానికి మించి సంపాదిస్తే.. ఆదాయపు పన్ను వ్యవస్థలోని.. పాత, కొత్త పన్ను విధానాల కింద పన్ను శ్లాబుల ఆధారంగా టాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. పన్ను వ్యవస్థను మరింత సులభతరం చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులపై భారీగా పన్ను రేట్లను తగ్గించి ఉపశమనం కల్పించింది కూడా. ఇక ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిశాక.. సదరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అక్టోబర్ 15తో ముగిసింది. ఇక్కడ పన్ను చెల్లింపుదారులు.. తాము చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువ టాక్స్ కడితే.. రిఫండ్ వస్తుంది. మరి ఇప్పుడు మీరు ఐటీఆర్ ఫైల్ చేసి.. రిఫండ్ కోసం చూస్తున్న సమయంలో.. అదే ఐటీ విభాగం నుంచి మీకు ఐటీ నోటీసులు వస్తున్నాయా.? ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు.టాక్స్ పేయర్లు.. పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో.. ఏదైనా తేడా ఉందని భావిస్తే.. ఐటీ శాఖ వివరణ కోరుతూ పంపించే అధికారిక ప్రక్రియే ఈ నోటీసులు. చాలా మంది ఈ నోటీసుల్ని చూసి భయపడుతుంటారు. ఏమైందో తెలియక.. ఆందోళన చెందుతారు. అయితే ఇది మిమ్మల్ని భయపెట్టేందుకు కాదని గుర్తుంచుకోవాలి. ఇది మరింత సమాచారం రాబట్టేందుకేనని తెలుసుకోవాలి. మీ లెక్కల్లో ఏదైనా తేడాలుంటే.. దానిని సరిదిద్దుకోవాలనే సూచన కావొచ్చు. కాబట్టి.. నోటీసులు అందుకోగానే భయపడొద్దు. పన్ను నోటీసులు ఎన్నో కారణాలతో వస్తుంటాయి. >> ముందుగా గడువు తేదీలోగా రిటర్న్స్ ఫైల్ చేయకుంటే.. నోటీసులు ఎక్కువగా వస్తాయి. లేట్ రిటర్న్స్‌పై రూ. 1000 నుంచి 5 వేల వరకు ఫైన్ పడుతుంది. ఇంకా గడువు తేదీ దాటితే.. జరిమానాతో కలిపి కొత్త పన్ను విధానంలోనే రిటర్న్స్ దాఖలు చేయాల్సి వస్తుంది. ఆదాయం తక్కువ చేసి చూపించిన సమయంలోనూ నోటీసులు వస్తాయి. (బ్యాంకుల్లో డిపాజిట్, షేర్ల అమ్మకాలు వంటివి) తేడా ఉంటే.. వివరణ కోరుతూ నోటీసులు పంపొచ్చు. ఇ్కకడ 15 రోజుల్లోగా సరైన సమాధానం ఇవ్వకుంటే జరిమానా పడొచ్చు. ఇంకా మీకు ఒకవేళ రిఫండ్ రావాల్సి ఉన్న సమయంలోనూ.. దాని కోసం చూస్తుంటే.. మీకు గత సంవత్సరాల్లో ఏమైనా బాకీ ఉన్నట్లయితే .. దాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపే నోటీసులు పంపుతుంది. కాబట్టి.. ముందుగా ఇక్కడ మీరు నోటీసు ఎందుకు వచ్చిందోనని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.