నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇక 'నామినీ' లేకుండా బ్యాంక్ ఖాతా కష్టమా?

Wait 5 sec.

Bank Rules: బ్యాంకు సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్లతో పాటుగా లాకర్, సేఫ్ డిపాజిట్ వంటి వాటికి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. బ్యాంకింగ్ లా సవరణ చట్టం 2025ని నవంబర్ 1వ తేదీ నుంచే అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)నిర్ణయించింది. అయితే, చాలా మందికి ఓ సందేహం మొదలైంది. నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఇచ్చి కొత్త రూల్ తీసుకొస్తున్నారు కదా లేకుండా కొత్త అకౌంట్ ప్రారంభించలేమా? అని. నామినీ పేరు చెప్పలేదనే కారణంతో సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, లాకర్ ఇవ్వమని బ్యాంకులు చెప్పవు. కస్టమర్ అభ్యర్థనను తిరిస్కరించేందుకూ కుదరదు. అన్ని అర్హతలు సరిగ్గా ఉన్నప్పుడు నామినీ పేరు సూచించకుండానే బ్యాంక్ ఖాతా ఇస్తాయి. నామినీ పేరుతో ఖాతాదారులను ఇబ్బందులు పెట్టకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఖాతాదారుడు ఎవరినీ నామినీగా ఎంచుకునేందుకు ఇష్టపడకపోతే ఆ విషయాన్ని బ్యాంకుకు రాతపూర్వకంగా అందించాలి. నాకు నామినేషన్ అవసరం లేదు అని డిక్లరేషన్ ఇవ్వాలి. అలా రాసి ఇచ్చేందుకూ ఖాతాదారు ఇష్టపడకపోతే ఆ విషయాన్ని బ్యాంక్ అధికారులు తమ రికార్డుల్లో నమోదు చేసుకుంటారు. నామినీని ఎంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఖాతాదారుడు దురదృష్ట వశాత్తూ మరణించినప్పుడు డబ్బులు ఈజీగా, ఎలాంటి చిక్కులు లేకుండా నామినీకి అందుతాయని వివరించాలని తెలిపింది. అయినప్పటికీ అకౌంట్ ఉన్న వ్యక్తి ఇష్టపడకపోతే వారిని ఒత్తిడి చేయవద్దని బ్యాంకులకు సూచించింది. నామినీని ఎంచుకోవాలని బ్యాంకులు కస్టమర్లను కొరుతాయి. తప్పనిసరి అని చెప్పవు. అనుకోని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు సులభంగా డబ్బులు అందాలంటే, నామినీ పేరు పేర్కొనడం మంచిది. అందకే ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.