ఏడాదిలో చేతికి డబ్బులు.. SBI సహా ఈ 8 బ్యాంకుల్లో అధిక వడ్డీ.. 5 లక్షలకు ఎంతొస్తుందంటే?

Wait 5 sec.

Fixed Deposits: మీరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఏడాదికే మీ డబ్బులు అందేలా ఉండి మంచి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్న బ్యాంకుల కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఆర్థిక అనిశ్చితి సమయంలో గ్యారంటీ రిటర్నులు అందించే ఎఫ్‌డీలు చేసేందుకు చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు బ్యాంక్ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతారు. అయితే డిపాజిట్లు ఏ బ్యాంకులో చేయాలి, ఎందులో వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి? అని తనిఖీ చేసి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. ముఖ్యంగా ఏడాదిలోనే చేతికి డబ్బులు తిరిగి రావాలనుకునే వారు ఏ బ్యాంకులో అధిక వడ్డీ ఉందో చూసుకోవాలి. దాదాపు అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు సమానంగా ఉంటాయని చెబుతుంటారు. 8 పెద్ద బ్యాంకులు ఏడాది మెచ్యూరిటీ టెన్యూర్ గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్, ఫెడరల్, కెనరా, పీఎన్‌బీ వంటివి ఉన్నాయి. ఆయా బ్యాంకులు జనరల్ కస్టమర్లకు 6.25 శాతం వడ్డీ అందిస్తున్నాయి. ఇక ఆ బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ ఇస్తున్నాయి. ఇందులో ఒక సాధారణ కస్టమర్ రూ.5 లక్షలు జమ చేసినట్లయితే 6.25 శాతం వడ్డీతో ఏడాదిలోనే చేతికి ఎంత వస్తుందో తెలుసుకుందాం. రూ.5 లక్షలపై వడ్డీ రూ.31,250 వరకు వస్తాయి. మొత్తంగా చేతికి రూ.5,31,250 మేర అందుతాయి. ఇక సీనియర్ సిటిజన్లకు అయితే 6.75 శాతం వడ్డీ రేటుతో ఏడాది తర్వాత చేతికి మొత్తం రూ. 5,33,750 మేర వస్తాయి. సీనియర్ సిటిజన్లకు 6.90 శాతం మేర వడ్డీ ఇస్తోంది. దీని ప్రకారం రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే జనరల్ కస్టమర్‌కి ఏడాది తర్వాత చేతికి రూ.5,32,000 అందుతాయి. అదే సీనియర్ సిటిజన్లకు అయితే రూ.5,34,500 వరకు వస్తాయి. మరోవైపు.. అధిక వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయా? లేక రెన్యూవల్ డిపాజిట్లకూ వర్తిస్తుందా అని ముందే తెలుసుకోవాలి. ఏడాది మెచ్యూరిటీ టెన్యూర్ మాత్రమే కాకుండా, ఇతర మెచ్యూరిటీ కాలల్లో ఎక్కువ వడ్డీ ఎందులో ఉన్నాయో చెక్ చేయాలి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడేళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై 6.6 శాతం వడ్డీ ఇస్తోంది. ఫెడరల్ బ్యాంక్ 999 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.