అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ అరుదైన రికార్డుకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడి శివమ్ దూబె రికార్డుకు.. ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్‌తో ఎండ్ కార్డ్ పడింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్.. 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో శివమ్ దూబె 37 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు. 2019లో దిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20తో శివమ్ దూబె అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి 4 వన్డేలు, 43 టీ20 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే దూబె చివరగా 2019 డిసెంబర్‌లో త్రివేండ్రం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్నాడు. అప్పటి నుంచి ఓటమి అనేది లేకుండా దూసుకెళ్తున్నాడు. అప్పటి నుంచి 37 మ్యాచ్‌లలో అతడు ఓటమి అనేది లేకుండా కొనసాగాడు. ఈ రికార్డ్‌తోనే శివమ్ దూబె టీమిండియా లక్కీ ఛార్మ్‌గా మారిపోయాడు. అతడు జట్టులో భాగంగా ఉన్నప్పుడే టీ20 ప్రపంచకప్‌ 2024, ఆసియాకప్‌ 2025 ట్రోఫీలను భారత్.. ఓటమి అనేది లేకుండా కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నీలో భారత్‌ విజేతగా నిలవడంలో దూబె కీలకపాత్ర పోషించాడు. తాజాగా విన్నింగ్ స్ట్రీక్‌ను కోల్పోయాడు.అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్లు ఎవరంటే..శివమ్ దూబే - 37 మ్యాచ్‌లు (2019-2025)పాస్కల్ మురుంగి - 27 మ్యాచ్‌లు (2022-2024*)జస్‌ప్రీత్ బుమ్రా - 24 మ్యాచ్‌లు (2021-2025)మనీష్ పాండే - 20 మ్యాచ్‌లు (2018-2020*)మహ్మద్ షెహజాద్‌ - 19 మ్యాచ్‌లు (2016-2021)కాగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి 125 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టీ20 నవంబర్ 2న జరగనుంది.