ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఈహెచ్‌ఎస్‌ స్కీమ్‌ కింద వైద్య సౌకర్యాలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1, 2020 తర్వాత పదవీవిరమణ చేసినవారితో పాటుగా.. ఇకపై రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా ఈ నిర్ణయం వర్తింపజేయనున్నారు. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే.. ఇక జీవితాంతం వారికి కింద ఉచిత వైద్యం అందించనున్నారు. రిటైర్ అయిన ఉద్యోగితో పాటుగా వారి జీవితభాగస్వామికి కూడా ఉచిత వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ ఆస్పత్రుల్లోనూ వారికి ఉచిత వైద్యం, మందులు అందించనున్నారు. అయితే ఇందుకోసం ఉద్యోగుల కేటగిరీల వారీగా ప్రభుత్వం ప్రీమియం నిర్దేశించింది. సూపరింటెండెంట్‌ కేటగిరీ ఉద్యోగుల వరకూ రూ.38,572 ప్రీమియంగా నిర్ణయించారు. అలాగే అసిస్టెంట్‌ మేనేజర్‌, ఆపై ర్యాంకు ఉద్యోగులకు రూ.51,429 ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. ఆర్టీసీ ఆస్పత్రులు చేసే సిఫార్సుల ఆధారంగా ఈహెచ్‌ఎస్‌ ఆస్పత్రుల్లో వీరికి చికిత్స అందించనున్నారు. సాధారణ ఉద్యోగుల తరహాలోనే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా రియంబర్స్‌మెంట్‌ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆర్టీసీ సంఘాలు, కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, ఆర్టీసీ ఛైర్మన్, ఎండీకి కృతజ్ఞతలు తెలిపారు.మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇటీవలేఅందించిన సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లను ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుకగా అందించింది. ఆర్టీసీలోని నాలుగు కేడర్ల ఉద్యోగులకు ప్రమోషన్లకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పనిష్మెంట్లు, పెనాల్టీలు, ఛార్జెస్‌లతో సంబంధం లేకుండా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, ఆర్జీజన్స్ కేడర్లలోని ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చింది. తీసుకున్నారు. అయితే సచివాలయం సిబ్బంది జాప్యం కారణంగా ఫైల్ క్లియర్ కాలేదు. ఇటీవల అయ్యారు. ఈ సందర్భంగానే డీఏ ప్రకటించిన చంద్రబాబు.. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా దీపావళి కానుకగా ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే ఉత్తర్వులు జారీ చేశారు.